Hero Ram Charan-RC16 : చెర్రీ బ‌ర్త్ డే రోజు ఆర్సీ 16 టీజ‌ర్

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది

Ram Charan : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ తేజ(Ram Charan) , జాహ్న‌వి క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ఆర్సీ 16. దీనిని స్పోర్ట్స్ నేప‌థ్యంలో తీసుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో క్రికెట్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. సాధ్య‌మైనంత మేర‌కు మూవీ మేక‌ర్స్ ఎలాగైనా స‌రే ఈ సినిమాకు సంబంధించి టీజ‌ర్ ను చెర్రీ పుట్టిన రోజున విడుద‌ల చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Ram Charan RC16 Movie Updates

ఇక జాహ్న‌వి క‌పూర్ కు తెలుగులో ఇది రెండ‌వ సినిమా కావ‌డం విశేషం. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న కొరటాల శివ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ దేవ‌ర‌లో న‌టించింది. అందాల‌ను ఆర‌బోసింది. ఇప్పుడు చెర్రీ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆర్సీ 16 మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీనిపైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నాడు గ్లోబ‌ల్ స్టార్.

ఆస్కార్ అవార్డు పుర‌స్కారం పొందిన ఆర్ఆర్ ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టించిన చిత్రం గేమ్ ఛేంజ‌ర్. అది ఇటీవ‌లే సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా విడుద‌లైంది. బోర్లా ప‌డింది. నిర్మాత దిల్ రాజుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో తీవ్ర నిరాశ‌లో ఉన్న మెగా అభిమానుల‌కు ఇప్పుడు బుచ్చిబాబు స‌న తీసే మూవీపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు.

Also Read : Popular Actor Govinda :విడాకులు అబ‌ద్దం గోవింద ఆగ్ర‌హం

Global Star Ram CharanRC16TrendingUpdates
Comments (0)
Add Comment