Ram Gopal Varma : ‘స్కిల్’ క్రిమిన‌ల్ – ఆర్జీవీ

బాబుపై షాకింగ్ కామెంట్స్

Ram Gopal Varma : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం ఆయ‌న స్పందించారు. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెమెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును అరెస్ట్ చేసింది.

Ram Gopal Varma Tweet Viral

ఏసీబీ కోర్టుకు త‌ర‌లించింది. అంతే కాకుండా ఈ కేసులో చంద్ర‌బాబు నాయుడు కీల‌క పాత్ర పోషించాడ‌ని పేర్కొంది. కొడుకు నారా లోకేష్ నాయుడు , అచ్చెన్నాయుడుకు పాత్ర ఉంద‌ని ఆరోపించింది. 25 పేజీల రిమాండ్ రిపోర్ట్ త‌యారు చేసింది. ఏసీబీ కోర్టుకు స‌మ‌ర్పించింది.

ఈ సంద‌ర్భంగా రామ్ గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) చంద్ర‌బాబు, లోకేష్ బాబును ఉద్దేశించి సెటైర్ వేశారు. ఒక ట‌న్ను స్టీల్ , 420 ట‌న్నుల మోసం అంటూ పేర్కొన్నారు. బ‌య‌ట‌కు చెప్ప‌క పోయినా లేదా ప్ర‌స్తావించ‌క పోయినా చంద్ర‌బాబును ఉద్దేశించి స్కిల్ క్రిమిన‌ల్ అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది సోష‌ల్ మీడియాలో.

ఇప్ప‌టికే రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి బాహాటంగా మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నారు.

Also Read : Prabhas Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ క‌న్ ఫ‌ర్మ్

Comments (0)
Add Comment