Hero Ram-Bhagyashri Borse :భాగ్యశ్రీ బోర్సేకు రామ్ ప్రేమ ప‌ల‌క‌రింపు

ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణమంటూ పుకార్లు

Bhagyashri Borse : డేటింగ్ పుకార్ల మ‌ధ్య యంగ్ హీరో రామ్ పోతినేని మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా మారారు. త‌నతో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే ఉన్న‌ట్టుండి లైమ్ లైట్ లోకి వ‌చ్చారు. త‌ను న‌టించింది కేవ‌లం ఒకే ఒక్క సినిమా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో కీల‌క పాత్ర పోషించింది. ఇందులో మ‌రో పాత్ర పోషించాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ఇందులో త‌న అంద చందాల‌తో ఆక‌ట్టుకుంది. అయితే ఆశించిన మేర సినిమా ఆడ‌లేదు. టాలీవుడ్ కు సంబంధించి ఒక్క‌సారి గ‌నుక సినిమా ఆడ‌క పోతే ఇక అందులో న‌టించిన హీరోయిన్ కు ఛాన్స్ లు అంటూ రావు.

Bhagyashri Borse-Ram Pothineni Love

కానీ ల‌వ్లీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)కు ఊహించ‌ని రీతిలో అవ‌కాశాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త‌ర్వాత త‌ను మూడు సినిమాల‌కు సంత‌కం చేసింది. ఇంకో మూవీ పూర్త‌య్యే ప‌నిలో ఉంది. రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌లిసి గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వంలో కింగ్ డ‌మ్ లో న‌టించింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. సినిమాకు సంబంధించిన టీజ‌ర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీనిపై గంపెడు ఆశ‌లు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

మ‌రో వైపు రామ్ పోతినేనితో క‌లిసి మూవీలో భాగ‌మైంది. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మధ్య ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో సైతం ప్రేమ పండింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా భాగ్య‌శ్రీ బోర్సే పుట్టిన రోజు కావ‌డంతో రామ్ పోతినేని ల‌వ్లీగా సందేశం పంపించాడు. అది మ‌రింత వెరైటీగా ఉండ‌డంతో త‌ను పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయిన‌ట్లు అర్థం అవుతోంది.

Also Read : Hero Mahesh-Buchibabu Sana :మ‌హేష్ బాబుతో బుచ్చిబాబు స‌న మూవీ..?

Bhagyashri BorseRam PothineniUpdatesViral
Comments (0)
Add Comment