Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్ పై రామ్ ఫోక‌స్

భారీ రెమ్యూన‌రేష‌న్ పై కాంట్రాక్టు

Ram Pothineni : టాలీవుడ్ లో మోస్ట్ ఎన‌ర్జ‌టిక్ హీరోగా గుర్తింపు పొందాడు రామ్ పోతినేని. త‌న న‌ట‌న‌తోనే , డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో న‌టించిన ఇస్మార్ శంక‌ర్ కు సీక్వెల్ గా సినిమాను స్టార్ట్ చేశాడు.

ఇందులో రామ్ పోతినేని(Ram Pothineni) కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రౌడీ హీరోగా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేతో క‌లిసి తీసిన లైగ‌ర్ ఎత్తి పోయింది. బాక్సాఫీసు వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత చెప్పుకోద‌గిన రీతిలో మూవీ ఏదీ రాలేదు పూరీకి.

Ram Pothineni Ismart Shanker Sequel

ఇప్పుడు రామ్ తో డ‌బుల్ ఇస్మార్ట్ పేరుతో చిత్రం తీస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాగా భారీ ఎత్తున ఈ మూవీకి సంబంధించి పారితోష‌కం తీసుకుంటున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్. ఈ మేర‌కు రామ్ కోరిన విధంగా ఇచ్చేందుకు కూడా మూవీ మేక‌ర్స్ అంగీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు పూరీ జ‌గ‌న్నాథ్. పూరీ క‌నెక్ట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఇంకా హీరోయిన్ , మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను ప్ర‌క‌టించ లేదు ద‌ర్శ‌కుడు. ఏది ఏమైనా రామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం విశేషం.

Also Read : Jailer : త‌మిళ నాట త‌లైవా ప్ర‌భంజ‌నం

ram phothineni puri jagannath double ismart movie
Comments (0)
Add Comment