Hero Ranbir Kapoor Ramayan : శ‌ర‌వేగంగా రామాయ‌ణ్ షూటింగ్

ర‌ణ‌బీర్ క‌పూర్ ర‌ష్మిక మంద‌న్న కీ రోల్స్

Ramayan : బాలీవుడ్ లో మ‌రో మూవీ సంచ‌ల‌నాల‌కు తెర లేపింది. ఇప్ప‌టికే ఇతిహాసంలో పేరు పొందిన రామాయ‌ణం(Ramayan) క‌థ‌పై ఎన్నో చిత్రాలు వ‌చ్చాయి. వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌పంచం ఉన్నంత వ‌ర‌కు రామాయ‌ణానికి ఢోకా ఉండ‌దంటున్నారు ఫ్యాన్స్. ప్ర‌స్తుతం దేశంలో ఆధ్యాత్మిక‌త‌తో కూడిన మూవీస్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Ramayan Movie Updates

అంతే కాదు చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వాటిని ఎక్కువ‌గా చూస్తున్నారు. కాసులు కురిపించేలా చేస్తున్నాయి. ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ప్ర‌భాస్ తో తీసిన క‌ల్కి దుమ్ము రేపింది. దీంతో క‌ల్కి సీక్వెల్ తీసే ప‌నిలో ఉన్నాడు. ఇప్ప‌టికే 25 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఇదే క్ర‌మంలో తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

అదేమిటంటే నేచుర‌ల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి ప‌ల్ల‌వి, నేష‌న‌ల్ స్టార్ హీరోగా పేరు పొందిన ర‌ణ‌బీర్ క‌పూర్(Ranbir Kapoor) జంట‌గా రామాయ‌ణ్ సినిమాగా రూపొందుతోంది. దీనిని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నితేష్ తివారీ తీస్తున్నాడు. ఇందులో సాయి ప‌ల్ల‌వి సీత‌గా క‌నిపించ‌నుంది. ఇక ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడిగా ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. అంతే కాదు క‌న్న‌డ హీరో య‌ష్ రావ‌ణుడిగా న‌టించ‌డం విశేషం.

దీంతో ముగ్గురు స్టార్లు న‌టిస్తుండ‌డంతో రామాయ‌ణ్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే డిమాండ్ నెల‌కొంది మూవీపై. కాగా ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ముంబైలో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ట్లు సమాచారం. రామాయ‌ణ్ మూవీని రెండు పార్ట్ లుగా తీయ‌నున్నారు ద‌ర్శ‌కుడు. ఫ‌స్ట్ పార్ట్ మూవీని వ‌చ్చే ఏడాది 2026 దీపావ‌ళి సంద‌ర్బంగా రిలీజ్ చేయ‌నున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో ర‌ణ‌బీర్, సాయి ప‌ల్ల‌వి, య‌ష్ , స‌న్నీ డియోల్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లారా ద‌త్తా న‌టిస్తుండ‌డం విశేషం.

Also Read : Kiss Kiss Kissak Movie Sensational :కిస్ కిస్ కిస్స‌క్ తెలుగు వెర్ష‌న్ రెడీ

CinemaRamayanranbir kapoorSai PallaviTrendingUpdates
Comments (0)
Add Comment