Randhir Jaiswal Sensational :పాక్ ఉగ్ర‌వాద దేశంగా ప్ర‌పంచం గుర్తించింది

స్ప‌ష్టం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ

Randhir Jaiswal : ఢిల్లీ – పాకిస్తాన్ త‌న వైఖ‌రి మార్చు కోవ‌డం లేద‌ని, అది పూర్తిగా ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మారి పోయింద‌ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని యావ‌త్ ప్ర‌పంచం గుర్తించింద‌ని తెలిపింది. ఇప్ప‌టికే ఉగ్ర‌వాదానికి ఊతం ఇస్తూ బుకాయిస్తూ వ‌స్తున్న పాకిస్తాన్ కు పుట్ట‌గ‌తులు లేకుండా చేస్తామ‌ని హెచ్చ‌రించింది. భార‌త్ ఎవ‌రికీ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొంది. అమెరికా కాదు క‌దా ఇంకే దేశ‌మైనా స‌రే త‌మ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చింది.

Randhir Jaiswal Sensational Comments

తాము ఏ దేశంపై ఆధార‌ప‌డే దుస్థితిలో లేవ‌ని స్ప‌ష్టం చేశారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఉగ్ర‌వాద కేంద్రం పాకిస్తాన్ లో ఉంద‌ని ప్ర‌పంచ స‌మాజం గుర్తించింద‌న్నారు. జ‌మ్మూ కాశ్మీర్ లోని పహ‌ల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల ఘ‌ట‌నను చూసి స‌భ్య స‌మాజం త‌ల దించుకుంద‌న్నారు.

అయినా పాకిస్తాన్ కు బుద్ది రావ‌డం లేద‌న్నారు. ఏది ఏమైనా ఇంకోసారి పాకిస్తాన్ భార‌త్ తో పెట్టుకుంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. ఆ దేశాన్ని లేకుండా చేస్తామ‌న్నారు. తాము కావాల‌ని ఎవ‌రి జోలికి వెళ్ల‌మ‌ని, కానీ త‌మ‌తో పెట్టుకుంటే మాత్రం తాట తీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు జైస్వాల్. ఇక‌నుంచి పాకిస్తాన్ త‌న‌ను తాను సంభాలించుకుంటే మంచిద‌ని, లేక పోతే యుద్దం త‌ప్ప‌ద‌న్నారు.

Also Read : Ex Minister Roja Shocking :ఏపీలో గాడి త‌ప్పిన కూట‌మి పాల‌న

BreakingCommentsInternational NewsMEARandhir JaiswalViral
Comments (0)
Add Comment