Rashmika Mandanna Interesting :ర‌ష్మిక మంద‌న్నా ఆస‌క్త‌క‌ర వ్యాఖ్య‌లు

రౌడీ ఆరోగ్యంగా..సంతోషంగా ఉండాలి

Rashmika Mandanna : డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై. త‌నకు ప్ర‌త్యేక‌మైన పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్బంగా త‌ను నిండు నూరేళ్లు జీవించాల‌ని, ఆయురారోగ్యాల‌తో , సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరింది. ఈ మేర‌కు సామాజిక మాధ్యం వేదిక‌గా స్పందించింది. త‌న‌కు 36 ఏళ్లు నిండాయంటే న‌మ్మ‌లేక పోతున్నాన‌ని పేర్కొంది న‌టి. ఆరోగ్యం, సంప‌ద‌, శాంతి క‌ల‌గాల‌ని కోరింది.

Rashmika Mandanna Interesting Comments

ఇదిలా ఉండ‌గా ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని కొట్టి పారేయ‌లేదు. ఎలాగూ స్పందించ‌లేదు. ఇద్ద‌రూ క‌లిసి వివిధ ప్రాంతాల‌కు వెళ్లారు. ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. దీంతో త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

ర‌ష్మిక మంద‌న్న‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి తొలిసారిగా డియ‌ర్ కామ్రేడ్ లో న‌టించారు. ఆ త‌ర్వాత ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌క్సెస్ ఫుల్ మూవీ గీత గోవిందంలో తెర‌ను పంచుకున్నారు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ జ‌ర్నీలో ఎంద‌రో తార‌స ప‌డ్డార‌ని, కానీ నీలాంటి వ్య‌క్తి ప‌రిచ‌యం త‌న‌కు కాలేద‌ని తెలిపింది. కొంత కాలం వెలితిగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్ర‌శాంతంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేసింది ర‌ష్మిక మంద‌న్నా.

Also Read : Tirumala Security Sensational :తిరుమ‌ల క్షేత్రంలో విస్తృత త‌నిఖీలు

CommentsInteresting NewsRashmika MandannaViral
Comments (0)
Add Comment