Rashmika Buy Luxurious Car :ఖ‌రీదైన కారును కొనుగోలు చేసిన ర‌ష్మిక

వ‌రుస మూవీస్ తో నేష‌న‌ల్ క్ర‌ష్ వెరీ బిజీ

Rashmika : ఇటు తెలుగులో అటు హిందీలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న(Rashmika) టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీతో క‌లిసి న‌టించిన పుష్ప‌-2 రికార్డుల‌ను తిర‌గ రాసింది. భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక వ‌సూలు చేసిన రెండ‌వ చిత్రంగా నిలిచింది. రూ. 1860 కోట్లు సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి తీసిన యానిమ‌ల్ లో కీ రోల్ పోషించింది. ఇది రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది.

Rashmika Mandanna Buy Luxurious Car

ఈ ఏడాది మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ త‌న‌యుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఛావా. ఇందులో శంభాజీ భార్యగా న‌టించింది ర‌ష్మిక మంద‌న్నా(Rashmika). ఈ చిత్రం అద్భుత విజ‌యాన్ని స్వంతం చేసుకుంది. ఏకంగా రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. వ‌రుస మూవీస్ బిగ్ స‌క్సెస్ తో ర‌ష్మిక మంద‌న్న అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టిగా గుర్తింపు పొందింది. అన్ని సినిమాలు క‌లిపి రూ. 3000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి సికంద‌ర్ లో న‌టించింది. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ ప్రమోష‌న్స్ లో భాగంగా ర‌ష్మిక మంద‌న్న వార్త‌ల్లో నిలిచింది. భారీ ధ‌ర‌కు మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. దీనిలోనే ఈ అమ్మ‌డు రావ‌డంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఎంతైనా మంద‌న్న‌నా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్. ఆమె వ‌ద్ద కాస్ట్ లీ కార్ల క‌లెక్ష‌న్స్ ఉన్నాయి. ఒక్కో మూవీకి త‌ను రూ. 10 కోట్లకు పైగా తీసుకుంటోంద‌ని అంచ‌నా. త‌న నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు దాటేసింద‌ని టాక్.

Also Read : Hero Vijay-Jana Nayagan :విజ‌య్ జ‌న నాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్

New CarRashmika MandannaTrending
Comments (0)
Add Comment