Rashmika Mandanna : తన లైఫ్ పార్టనర్ క్వాలిటీస్ పై క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్

ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు బిజీగా ఉన్నారు...

Rashmika Mandanna : జీవితంలోని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌ చేయాలనీ కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలనీ ఆమె అన్నారు. శ్రద్ధ వహించాలనీ మంచి మనసు ఉండాలనీ ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చు అని తెలిపారు. ఇక ప్రేమ గురించి చెబుతూ.. జీవితంలో ప్రతిఒక్కరికీ తోడు కావాలనీ తన దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే అనీ చెప్పారు. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదనీ ఒడిదుడుకుల్లో తమతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి అని అన్నారు.

Rashmika Mandanna Comments

ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. రూ.1500 కోట్లకు చేరువలో ఉంది. అలాగే రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్‌ తాజాగా విడుదలైంది. విజయ దేవరకొండ వాయిస్‌ అందించిన ఆ టీజర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రానుంది.

Also Read : Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఆర్థికసాయం అబద్ధం అంటున్న కాంగ్రెస్ నేతలు

CommentsRashmika MandannaTrendingUpdatesViral
Comments (0)
Add Comment