Rashmika Mandanna: రష్మిక బర్త్ డే గిఫ్ట్ గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ !

రష్మిక బర్త్ డే గిఫ్ట్ గా 'ది గర్ల్ ఫ్రెండ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ !

Rashmika Mandanna: ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, దీరజ్‌ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై విద్యా కొప్పినీది, ధీరజ్‌ మోగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన ప్రేమ కథతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ గెటప్ లో రష్మిక కనిపించబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ కోసం ఐదు భాషల్లో రష్మిక డబ్బింగ్‌ చెప్పారు.

Rashmika Mandanna Birthday Gift

అయితే శుక్రవారం రష్మిక మందన్నా(Rashmika Mandanna) బర్త్ డే సందర్భంగా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక సింపుల్ మేకోవర్‌ లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. “ది గర్ల్ ఫ్రెండ్” లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్‌ లుక్‌ పోస్ట్‌ విడుదలైంది. అందులో ఆమె లుక్‌ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఉండటంతో టీజర్‌ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.

Also Read : Lavanya Tripathi: నాలుగు నెలలు తరువాత జిమ్ లో సందడి చేసిన మెగా కోడలు !

Rashmika Mandannathe girl friend
Comments (0)
Add Comment