ప్ర‌శాంత్ నీల్ మూవీలో నేష‌న‌ల్ క్ర‌ష్

డ్రాగ‌న్ స‌ర‌స‌న న‌టించ‌నున్న ర‌ష్మిక

ప్ర‌శాంత్ నీల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తీస్తున్న చిత్రం డ్రాగ‌న్. ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇప్ప‌టికే త‌ను తీసిన కేజీఎఫ్‌, స‌లార్ భార‌తీయ సినిమా రంగాన్ని షేక్ చేశాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో మేకింగ్ టేకింగ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్న ద‌ర్శ‌కుడు కావ‌డంతో రాబోయే డ్రాగ‌న్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే త‌న స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై జోరుగా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.

కొంద‌రు జాన్వీ క‌పూర్ అని అంటుంటే మ‌రికొంద‌రు ర‌ష్మిక మంద‌న్నా కూడా న‌టించ బోతున్న‌ట్లు టాక్. దీనికి ఇంకా చెక్ పెట్ట‌లేదు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి ప్ర‌తిష్టాత్మ‌కంగా. ఇప్ప‌టికే మైత్రీ సంస్థ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ను నిర్మించింది. ఈ ఏడాది వారికి ఏకంగా భారీ ఎత్తున వ‌సూళ్లు సాధించేలా చేసింది సుకుమార్ తీసిన పుష్ప 2 . ఇది ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. ఈ జోష్ తో క‌న్న‌డ లో ర‌ష్మిక మంద‌న్న‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది.

ఇందులో భాగంగా తాజాగా సినీ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు ఈ నేష‌న‌ల్ క్ర‌ష్ ఉన్న‌ట్టుండి
స్పెష‌ల్ సాంగ్ లో న‌టించ‌నుంద‌ని, ఈ మేర‌కు ప్ర‌శాంత్ నీల్ కు కూడా ఓకే చెప్పేసింద‌ని ప్ర‌చారం. ఇప్పుడు టాప్ హీరోయిన్లు సైతం స్పెష‌ల్ సాంగ్స్ ల‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప‌-1లో స‌మంత ఊ అంటావా సాంగ్ చేస్తే పుష్ప‌-2లో మ‌రో ప్ర‌త్యేక పాట‌ను శ్రీ‌లీల చేసింది. ఇప్పుడు క‌న్న‌డ భామ ర‌ష్మిక సైతం ఓకే చెప్ప‌డంతో ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు.

Comments (0)
Add Comment