జీవితం అద్భుతం ఈరోజే నాకు ముఖ్యం

స‌క్సెస్ ఫెయిల్యూర్ గురించి వ‌ర్రీ కాను

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మ‌ధ్య‌న లోతైన మాట‌లు మాట్లాడుతున్నారు. త‌న‌కు జీవితం ప‌ట్ల క్లారిటీ ఉంద‌ని పేర్కొన్నారు. చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. జీవితం అద్బుత‌మ‌ని, ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేర‌ని అన్నారు. ఏదీ శాశ్వతం కాద‌ని, అంద‌రం మ‌ట్టిలో క‌లిసి పోయే వాళ్లం అంటూ వేదాంత ధోర‌ణితో మాట్లాడారు ర‌ష్మిక మంద‌న్నా.

త‌ను గ‌త కొంత కాలంగా సెలెక్టివ్ గా పాత్ర‌ల‌ను ఎంచుకుంటోంది. ఈఏడాది తను న‌టించిన ఛావా చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇదే స‌మ‌యంలో అంత‌కు ముందు బ‌న్నీతో క‌లిసి న‌టించిన పుష్ప 2 దుమ్ము రేపింది. ఏకంగా ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక వ‌సూలు సాధించిన చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. దీనిని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించారు. రూ. 1867 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. చావా స‌క్సెస్ కాగా స‌ల్మాన్ ఖాన్ తో న‌టించిన చిత్రం బోల్తా కొట్టింది.

అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు త‌ను . చాలా కాలంగా రౌడీ గా పేరు పొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ను త‌న కోసం బ‌తుకుతాన‌ని, లైఫ్ ను సాధ్య‌మైనంత మేర ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటాన‌ని తెలిపింది ర‌ష్మిక మంద‌న్నా. అయితే సికింద‌ర్ మూవీ ఆడ‌క పోవ‌డం అనే దానిపై స్పందిస్తూ గ‌తం గురించి ఆలోచించ‌ను. భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందోన‌ని భ‌యాందోళ‌న‌కు గురి కాను. ప్ర‌స్తుతం బ‌త‌కాడిన‌కే ప్ర‌యారిటీ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేసింది .

Comments (0)
Add Comment