Hero Ravi Teja : రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న నేషనల్ క్రష్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రవితేజతో నటించడానికి నో చెప్పిందట....

Hero Ravi Teja : మాస్ మహారాజ రవితేజ హిట్స్ కోసం చాలా చాలా రోజులుగాఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు రవితేజ(Hero Ravi Teja). మధ్యలో వరుసగా సినిమాలు చేసినా అవి యావరేజ్ గానే నిలిచాయి. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాతో మాస్ రాజా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్’, సాంగ్స్ సినిమా పై హైప్‌ను క్రియేట్ చేశాయి. అలాగే ఈ సినిమాలో రవితేజ మరోసారి తన ఎనర్జీతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలిం సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Hero Ravi Teja…

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రవితేజ(Hero Ravi Teja)తో నటించడానికి నో చెప్పిందట.. రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికి రష్మిక మందన్న మిస్ చేసుకుందట.. ఆమె మిస్ చేసుకోవడంతో ఆమె ప్లేస్‌లోకి మరో క్రేజీ హీరోయిన్ వచ్చింది. ఆమెనే శ్రీలీల. ఆ సినిమా ఎదో కాదు ధమాకా. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఈ మూవీలో రవితేజ , శ్రీలీల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ ధమాకా’ ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది రవి తేజతో శ్రీలీల ఏంటి.? అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కామెంట్స్ అన్ని కొట్టుకుపోయాయి. రవితేజ, శ్రీలీల అదరగొట్టారు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రష్మిక మందన్నను హీరోయిన్ గా అనుకున్నాడట దర్శకుడు త్రినాద్ రావు నక్కిన. సంప్రదింపులు కూడా జరిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ, రష్మిక కాకుండా శ్రీలీలను ధమాకా సినిమా కోసం తీసుకున్నారు దర్శకుడు. ఇక ఇప్పుడు రవితేజ, శ్రీలీల కాంబోలో మరోసినిమా రానుంది.

Also Read : Vishwak Sen: కొత్త సినిమా ప్రకటించిన విష్వక్‌ సేన్‌ !

BreakingMass Maharaj Ravi TejaRashmika MandannaUpdatesViral
Comments (0)
Add Comment