ప్రముఖ సీనియర్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గురించి ప్రతి విషయాన్ని పిల్లలతో పంచుకుంటానని పేర్కొంది. ఈ మధ్య ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడింది రవీనా టాండన్. ఆమె ప్రస్తుతం రియాల్టీ షోతో పాటు వెబ్ సీరీస్ లో ప్లాన్ చేస్తోంది.
1990 ఆ ప్రాంతంలో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో తను కూడా ఒకరుగా ఉన్నారు. ఆమె చాలా కాలం పాటు ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తో డేటింగ్ లో ఉన్నారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి నటించిన మొహ్రాలో ఏకంగా రొమాన్స్ పండించారు. పెళ్లి పీటల దాకా వచ్చారు. నిశ్చితార్థం కూడా పూర్తయింది. కానీ ఎందుకనో ఒక్కటి కాలేక పోయారు.
ఆ తర్వాత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకున్నారు. తన కూతురు ప్రస్తుతం తెరంగేట్రం చేస్తోంది తెలుగులో. నటుడు చెర్రీతో బుచ్చిబాబు తీసే సినిమాలో కీ రోల్ పోషించనుంది.
ఇదిలా ఉండగా తన డేటింగ్, తాను నడిపిన ప్రేమ వ్యవహారాలు , చేసిన తప్పులు, సాధించిన సక్సెస్ లు అన్నీ పిల్లలకు వివరంగా చెబుతానని చెప్పింది. అలా చెప్పడం వల్ల ఎలాంటి దాపరికాలు, అనుమానాలు అంటూ ఉండవని , అప్పుడే ఫ్యామిలీ ఆనందంగా ఉంటుందంటోంది ఈ ముద్దుగుమ్మ.