అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ ఉన్నట్టుండి గాయపడ్డారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్బంగా తను స్పందిస్తూ తనకు ఏమీ కాలేదని ఎవరూ తన గురించి ఆలోచించ వద్దంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. అయితే అమెరికా వేదికగా అమెరికన్ మ్యూజిక్ అవార్ట్స్ (ఏఎంఏ) కార్యక్రమానికి జెన్నిఫర్ లోపెజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ సందర్బంగా రిహార్సల్స్ చేస్తుండగా ఉన్నట్టుండి గాయపడింది.
ఇందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తీవ్రంగా గాయం కావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో జెన్నిఫర్ లోపెజ్ స్పందించింది. ఇదిలా ఉండగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కీలక వ్యాఖ్యలు చేసింది. మీరంతా తనపై కురిపిస్తున్న ప్రేమ తనను మరింత ఆసక్తిని రేపిందని పేర్కొంది లోపెజ్.
రిహార్సల్స్ చేస్తుండగా అదుపు తప్పి పడి పోయానని, ముక్కుకు గాయమైందని తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో తాను ప్రశాంతంగా ఉన్నానని , తన ఆరోగ్యం కుదట పడిందని స్పష్టం చేసింది. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరింది నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్. ఐస్ వాడుతుండడంతో గాయం నయం అవుతోందని, తాను తప్పకుండా అమెరికన్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని తెలిపింది.