HCU Issue-Renu Desai Shocking :హెచ్‌సీయూ విధ్వంసం రేణు దేశాయ్ ఆగ్ర‌హం

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని సీఎంకు విన్న‌పం

Renu Desai : ప్ర‌ముఖ న‌టి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప‌ర్యావ‌రాణాన్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించింది. హైద‌రాబాద్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాలను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం, దీనిని పెద్ద ఎత్తున విద్యార్థులు అడ్డు కోవ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీనిపై వివిధ రంగాల‌కు చెందిన వారు, ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే వేలం పాట‌ను నిలిపి వేయాల‌ని పిలుపునిస్తున్నారు. ప్ర‌త్యేకంగా స్పందిస్తున్నారు.

Renu Desai Serious

చిన్నారులు, పెద్ద‌లు, వివిధ రంగాల‌కు చెందిన వారు, పెద్ద‌లు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, మేధావులు, విద్యార్థి సంఘాల నేత‌లు, వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన వారంతా మూకుమ్మ‌డిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమంటున్నారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణం పూర్తిగా పోలీసుల ప‌హారాలో కొన‌సాగుతోంది. కంచె గ‌చ్చిబౌలిలో యూనివ‌ర్శిటీకి సంబంధించిన భూముల‌న్నీ త‌మ‌వేనంటూ ప్ర‌క‌టించింది తెలంగాణ స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా ఈ భూముల వివాదంపై తీవ్రంగా స్పందించి న‌టి రేణూ దేశాయ్.

ఈ సంద‌ర్బంగా ఓ వీడియోను విడుద‌ల చేసింది సోష‌ల్ మీడియా వేదిక‌గా. వెంట‌నే ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి విన్న‌వించింది. రోజు రోజుకు భూముల‌ను అమ్ముకుంటూ పోతే చివ‌ర‌కు ఆక్సిజ‌న్ పీల్చేందుకు గాలి కూడా ఉండ‌ద‌ని పేర్కొంది. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌కారిగా ఉండేలా త‌ప్పా వారిపై పెత్త‌నం చేస్తే ఎలా అని రేణు దేశాయ్ ప్ర‌శ్నించింది. త‌నకు ఇప్పుడు 44 ఏళ్లు. ఇంకొన్నేళ్లు బ‌తుకుతా. ఆ త‌ర్వాత చ‌ని పోతా..త‌మ త‌ల్లుల పిల్ల‌ల‌కు ఏం మిగుల్చుతారంటూ నిల‌దీసింది.

Also Read : Hero Naga Chaitanya :జోరు మీదున్న అక్కినేని నాగ చైత‌న్య‌

CommentsRenu DesaiUpdatesViral
Comments (0)
Add Comment