Retro : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం రెట్రో. భారీ బడ్జెట్ తో నటీ నటులు, భార్య భర్తలైన జ్యోతిక, సూర్య కలిసి నిర్మించారు. సస్పెన్స్, థ్రిల్లర్ , రొమాంటిక్ నేపథ్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. మేడే సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా రెట్రో(Retro) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్బుతమైన టాక్ వచ్చేసింది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు సూర్య , కార్తీక్ , పూజా హెగ్డే అభిమానులు. సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
Karthik Subbaraj Retro Movie Success
సూర్య స్టామినా ఏమిటో మరోసారి చూపించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. టేకింగ్, మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చాడు. ఇక మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. సూర్య సినీ కెరీర్ లో రెట్రో ఓ మైలు రాయిగా నిలిచి పోక తప్పదని అంటున్నారు సినీ విమర్శకులు. విజువల్ సూపర్ మూవీగా తీర్చిదిద్దాడు.
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే సూపర్ షో చేసింది. ప్రత్యేకించి కార్తీక్ సుబ్బరాజ్ సినిమా తీస్తే అందులో ఎలాంటి అందాల ఆరబోత లేకుండా తీయడంలో తనకు తానే దిట్ట. పూజా హెగ్డేను ఎన్నడూ లేని విధంగా, ఏ దర్శకుడు చూపించని రీతిలో నటించేలా చేశాడు. తన అమ్మమ్మ కట్టుకున్న చీరతో దర్శనం ఇచ్చింది ఈ మూవీలో.
రెట్రో మూవీ రిలీజ్ కు ముందుకు చేసిన ప్రమోషన్స్ కూడా మంచి కిక్ ఇచ్చేలా చేశాయని చెప్పక తప్పదు. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిత్రంలో సూర్య పారివేల్ పారి కన్నన్ పాత్ర పోషించాడు. తన భార్య రుక్మిణికి హింసాత్మక జీవితాన్ని వదిలి వేస్తానంటూ వాగ్ధానం చేస్తాడు. గతంలో గ్యాంగ్ స్టర్ గా పని చేశాడు. కానీ తన భార్యను రక్షించు కునేందుకు తిరిగి గ్యాంగ్ స్టర్ గా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలంటే రెట్రో తప్పకుండా చూడాలి.
Also Read : 3 Roses Web Series Sensational :వెబ్ సీరీస్ 3 రోజెస్ గ్లింప్స్ రిలీజ్