Hero Suriya-Retro Movie :రెట్రో వైర‌ల్ ‘క‌నిమా’ సాంగ్ హ‌ల్ చ‌ల్

కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సూర్య‌..పూజా

Retro : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది తాజాగా సూర్య‌, ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) క‌లిసి న‌టించిన చిత్రం రెట్రో. ఈ మూవీలోని క‌నిమా సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పోటీ ప‌డి న‌టించారు హీరో, హీరోయిన్లు. ఈ చిత్రానికి టాప్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో జోజు జార్జ్, నాస‌ర్, ప్ర‌కాశ్ రాజ్ , జ‌య‌రామ్, క‌రుణాక‌రన్, విద్యా శంక‌ర్ ఇత‌ర పాత్ర‌లు పోషించారు.

Retro Movie Updates

క‌నీమా లిరిక‌ల్ సాంగ్ కు సంతోష్ నారాయ‌ణ్ స్వ‌ర క‌ల్ప‌న చేయ‌గా వివేక్ సాహిత్యం అందించారు. కుర్ర కారును మ‌రింత ఎంజాయ్ చేసేలా చేస్తోంది ఈ పాట‌. దీనిని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టీ సీరీస్ స‌మ‌ర్పించింది. కార్తీక్ , సూర్య కాంబోలో వ‌స్తున్న మూవీ రెట్రో(Retro)పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పూర్తిగా యాక్ష‌న్ , స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు సుబ్బ‌రాజు.

ఇదిలా ఉండ‌గా వ‌చ్చే మే నెల 1వ తేదీన విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు నిర్మాత‌లు. ఇక సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్త‌యింది. సూర్య సైతం ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. స‌క్సెస్ ఫెయిల్యూర్ అనే దానిని ప‌క్క‌న పెడుతూ మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు న‌టుడు సూర్య‌. దీంతో త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోవ‌డం త‌న‌కు ముందు నుంచి అలవాటు. దీంతో రెట్రో పై ఫుల్ ఫోక‌స్ పెట్టాడు. ఇక త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరొందిన కార్తీక్ సుబ్బ‌రాజ్ తీసే విధానం డిఫ‌రెంట్ గా ఉంటుంది.

Also Read : Hero Chiyaan Vikram :మంచి క‌థ దొరికితే తెలుగులో న‌టిస్తా

CinemaPooja HegdeRetroSuriyaTrendingUpdates
Comments (0)
Add Comment