Robinhood vs Mad 2 Sensational :రాబిన్ హుడ్..మ్యాడ్ 2 నువ్వా నేనా

మార్చి 28న ఒకే రోజు విడుద‌ల‌కు రెఢీ

Robinhood : టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది మార్చి 28వ రోజు. ఎందుకంటే ఫుల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో తీసిన చిత్రం మ్యాడ్ రిలీజ్ కానుండ‌గా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ రెడ్డి, శ్రీ‌లీల‌, డేవిడ్ వార్న‌ర్, కేతికా శ‌ర్మ క‌లిసి న‌టించిన రాబిన్ హుడ్(Robinhood) కూడా అదే రోజు విడుద‌ల కానుండ‌డంతో ఈ రెండు సినిమాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఏ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే దానిపై చ‌ర్చ కొన‌సాగుతోంది.

Robinhood vs Mad 2 Movie in Tollywood

ఇప్ప‌టికే మ్యాడ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. పోస్ట‌ర్స్, టీజ‌ర్ తో పాటు సాంగ్స్ కూడా ఫుల్ ఆద‌ర‌ణ చూర‌గొంటున్నాయి. ఇదే స‌మ‌యంలో రాబిన్ హుడ్ మ్యూజిక్ ప‌రంగా మ్యాజిక్ చేసింది. రిలీజ్ చేసిన సాంగ్స్ టాప్ లో కొన‌సాగుతున్నాయి. చార్ట్స్ లో నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాయి. త‌మిళ సినీ సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాశ్ కుమార్ అందించిన సంగీతం ఓ రేంజ్ లో ఉంది. ఒన్ మోర్ టైమ్ అంటూ పాడుకుంటున్నారు కుర్ర‌కారు.

ప్రేక్ష‌కులు మాత్రం త‌మ అభిరుచులను మార్చుకుంటున్నారు. ఎక్కువ‌గా హింస‌, సీరియ‌స్ నెస్ లేకుండా ఉండేలా కేవ‌లం కామెడీ పండించే వాటినే కోరుకుంటున్నారు. దీంతో మ్యాడ్ 2(Mad 2) , రాబిన్ హుడ్ చిత్రాలు వాటిపైనే ఫోక‌స్ పెట్టినా ఏది ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటుంద‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ వీడ‌డం లేదు. ఇక రాబిన్ హుడ్ విష‌యానికి వ‌స్తే అదిదా స‌స్పెన్స్ సాంగ్ కాంట్రావ‌ర్సీ కావ‌డం, ఈ చిత్రానికి ప్ర‌చార ప‌రంగా క‌లిసి వ‌చ్చిందంటూ టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.

మ్యాడ్ విష‌యానికి వ‌స్తే ఎలాంటి అస‌భ్య‌త‌కు తావు లేకుండా డైరెక్ట‌ర్ జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఫ్యామిలీస్ ను ప‌క్కాగా ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇదే త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. మొత్తంగా 28న తేలి పోనుంది ఏ మూవీ బెట‌ర్ అనేది.

Also Read : Hero Allu Arjun-Atlee :అట్లీతో మూవీకి బ‌న్నీ భారీ పారితోషం..?

Mad SquareRobinhoodTrendingUpdates
Comments (0)
Add Comment