బెంగళూరు – భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్బంగా బెంగళూరులో తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్సీబీతో పాటు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రియల్ ఫైటర్స్ ఫోరం చీఫ్ వెంకటేష్ కబ్సన్ పార్క్.
ఇదిలా ఉండగా ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరు వేదికగా జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం నాటికి తుది నివేదిక ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది సర్కార్.
ఆర్సీబీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేయాలిన ఆదేశించారు సీఎం సిద్దరామయ్య. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో ఫెయిల్ అయినందుకు సిటీ నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తో పాటు డీఎస్పీపై వేటు వేసింది. అంతే కాకుండా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్సీబీతో పాటు కేసీఏ ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు.