RRR Movie : మ‌రోసారి ఆర్ఆర్ఆర్ రికార్డ్

జ‌క్క‌న్న చిత్రానికి అవార్డుల పంట

RRR Movie : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. జాతీయ అవార్డులో తాను తీసిన ఆర్ఆర్ఆర్ కు పుర‌స్కారాల పంట పండింది. ర‌ణం రుద్రం రుధిరం చిత్రంతో పాటు సుకుమార్ తీసిన పుష్ప కు కూడా ఎనిమిది అవార్డులు ద‌క్కాయి.

RRR Movie Got National Awards

ఆర్ఆర్ఆర్ కు ఆరు ద‌క్కితే , పుష్ప‌కు రెండు అవార్డులు ల‌భించాయి. జ‌క్క‌న్న ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు. ఆయ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్ తో , రామ్ చ‌ర‌ణ్ తో మ‌గ‌ధీర తీశాడు. ర‌వితేజ‌తో విక్ర‌మార్కుడు, డార్లింగ్ ప్ర‌భాస్ తో బాహుబ‌లి, బాహుబ‌లి 2, నానితో ఈగ తీశాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ తో క‌లిపి ఆర్ఆర్ఆర్(RRR Movie) ను తెర‌కెక్కించాడు.

ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా అంత‌ర్జాతీయ ప‌రంగా ఆస్కార్ అవార్డును ద‌క్కించుకుంది. దీంతో ఎస్ఎస్ రాజ‌మౌళి ఇండియాలోనే కాదు ఇంట‌ర్నేష‌న‌ల్ గా పేరు పొందాడు. ఇక ఆర్ ఆర్ కు జాతీయ స్థాయిలో ఉత్త‌మ జ‌న రంజ‌క చిత్రంగా, ఉత్త‌మ కొరియో గ్ర‌ఫీ, ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్ , ఉత్త‌మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ఉత్త‌మ ప్లే బ్యాక్ సింగ‌ర్ ,ఉత్త‌మ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ విభాగాల‌లో ఆర్ఆర్ఆర్ కు అవార్డులు ద‌క్కాయి.

Also Read : SS Rajamouli : జ‌క్క‌న్న వెరీ వెరీ స్పెష‌ల్

rrr movie ss rajamouli 6 national awards
Comments (0)
Add Comment