SA Cricket Board Shocking :టాటా ఐపీఎల్ కు సౌతాఫ్రికా బోర్డు షాక్

విదేశీ ఆట‌గాళ్లు వెళ్లాల్సిందేన‌ని హుకుం

SA Cricket Board : ముంబై – బీసీసీఐకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే ఒప్పందం ప్ర‌కారం విదేశీ ఆట‌గాళ్ల‌ను మే 26 లోపు పంపించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఆయా ఫ్రాంచైజీలు స‌ద‌రు ప్లేయ‌ర్ల‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. వీట‌న్నింటిని బీసీసీఐ(BCCI) – ఐపీఎల్ గ‌వ‌ర్నెన్స్ బాడీకి లోబ‌డి ఉంటాయి. తాజాగా నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కారం ఐపీఎల్ 18వ సీజ‌న్ ను నిర్వ‌హంచ లేక పోయింది బీసీసీఐ.

SA Cricket Board Shocking BCCI

భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఆట‌గాళ్ల భ‌ద్ర‌త దృష్ట్యా ఐపీఎల్ ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజాగా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుద‌ర‌డంతో తిరిగి ఐపీఎల్ ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మే 17 నుంచి మిగిలి పోయిన మ్యాచ్ ల‌ను చేప‌ట్ట‌నుంది. ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను కూడా మార్చేసింది. కోల్ క‌తాలో జ‌ర‌గాల్సి ఉండ‌గా సెక్యూరిటీ కోసం అహ్మ‌దాబాద్ కు మార్చేసింది.

మ‌రో వైపు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. నిర్దేశించిన తేదీ కంటే ముందే త‌మ దేశం ఆట‌గాళ్లు రావాల్సిందేన‌ని ఆదేశించింది. దీంతో ఐపీఎల్ లో వారు ఆడ‌తారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. కార్బిన్ బాష్, వియాన్ ముల్ల‌ర్, మార్కో జాన్సెన్ , ఐడెన్ మార్క‌ర్రామ్, లుంగిడి, క‌గిసో ర‌బాడా, ర్యాన్ రికెల్ట‌న్ , ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ ఉన్నారు. వీరితో పాటు బ్రెవిస్, ఫ్లాఫ్ డుప్లెసిస్ , ఫెర్రీరా, జెరాల్డ్ కొట్టీ, క్వింట‌న్ డికాక్, నార్జే, డేవిడ్ మిల్ల‌ర్, మాథ్యూ, నాండ్రే బ‌ర్గ‌ర్ , క్వేనా మఫాకా, లువాన్ డ్రే , క్లాసెన్ ఉన్నారు. మ‌రి ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Also Read : India New Chief Justice :బిడ్డా నువ్వు ఏదో రోజు చీఫ్ జ‌స్టివ్ అవుతావు

Comments (0)
Add Comment