Sai Dharam Tej: హాలీవుడ్‌ నుండి ఆహ్వానం అందుకున్న సాయి ధరమ్‌ తేజ్‌

హాలీవుడ్‌ నుండి ఆహ్వానం అందుకున్న సాయి ధరమ్‌ తేజ్‌

Sai Dharam Tej: విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా షార్ట్ ఫిల్మ్ ‘సత్య’. ఎమోషనల్, ప్రేమ, దేశభక్తి అంశాలు ఉన్న సత్య అనే కాన్సెప్ట్ లతో తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ లో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సరసన కలర్స్ స్వాతి నటించగా… సీనియర్ నటుడు తనయుడు విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సోల్ ఆఫ్ స‌త్య’ పేరుతో విడుదల చేసినా పాట కూడా మంచి స్పందన వచ్చింది. గాయని శృతి రంజని ఈ పాటకు సంగీతం అందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవల న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేదికపై ప్రదర్శించగా.. ఇది రెండు అవార్డులను పొందింది.

Sai Dharam Tej – అరుదైన గౌరవం దక్కించుకున్న సాయి ధరమ్ తేజ్ ‘సత్య’ షార్ట్ ఫిల్మ్

ఓ సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగాలను షార్ట్ ఫిల్మ్ రూపంలో చాలా చక్కగా వివరించిన ఈ షార్ట్‌ ఫిల్మ్ ‘సత్య’ ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా దీనికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నటుడు సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej) సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘నాకెంతో ఇష్టమైన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ను… డిసెంబర్‌ 9న హాలీవుడ్‌ బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకను మా షార్ట్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్‌తోనే మొదలు పెట్టడం ఎంతో గౌరవంగా ఉంది. ఇది మా టీమ్ అందరికీ గర్వకారణం. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉండే వాళ్లు ఆ వేడుకకు హాజరై ‘సత్య’ను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌ చేశారు. దీనితో సాయి ధరమ్ తేజ్ తో పాటు ‘సత్య’ షార్ట్ ఫిల్మ్ టీంకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉండే తెలుగు వారు… వుయ్ విల్ మీట్ టూ ఎట్ కాలిఫోర్నియా అంటూ మెసేజ్ లు చేస్తూ సాయి ధరమ్ తేజ్ కు ఆహ్వానం పలుకుతున్నారు.

డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ పై గతంలో సాయి ధరమ్ షార్ట్ ఫిల్మ్

రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన నటుడు సాయి ధరమ్ తేజ్()… మద్యం త్రాగి డ్రైవింగ్ చేయవద్దు అనే షార్ట్ ఫిల్మ్ లో గతంలో నటించారు. దీనికి మంచి స్పందన రావడంతో దేశం కోసం పోరాటం చేసే ఎందరో యోధుల‌కు సంబంధించిన సందేశాన్ని తెలియ‌జేయ‌టానికి ‘సత్య’ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో పాటు ఆయ‌న స్నేహితులు హ‌ర్షిత్ రెడ్డి, న‌వీన్ విజ‌య్ కృష్ణ ఈ షార్ట్‌ ఫిల్మ్ లో భాగ‌స్వామ్యులుగా వ్య‌వ‌హ‌రించగా.. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాత‌లు హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత రెడ్డి దీనిని రూపొందించారు. సీనియర్ నటుడు తనయుడు న‌వీన్ విజ‌య్ కృష్ణ ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించారు.

Also Read : Shilpa Shetty: సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడు పెంచిన శిల్పా శెట్టి

Sai Dharam Tej
Comments (0)
Add Comment