Sai Pallavi : టాలీవుడ్ లో సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. నేచురల్ నటిగా గుర్తింపు పొందిన తను వెరీ వెరీ స్పెషల్. కథ నచ్చితేనే కాదు తన పాత్రకు కూడా గుర్తింపు ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేలా ఉంటేనే తను ఒప్పుకుంటుంది. లేకపోతే డోంట్ కేర్ అంటుంది. తన కెరీర్ పరంగా తనకు నచ్చితేనే పాత్రలకు ఓకే చెబుతుంది. లేకపోతే ఎన్ని కోట్లు ఇస్తానన్నా తీసుకునేందుకు ఒప్పుకోదు. స్థిరమైన కథకు ప్రయారిటీ ఉంటుంది. ఇదే విషయాన్ని పదే పదే సినీ రంగానికి చెందిన దర్శక, నిర్మాతలకు చెబుతూ వస్తోంది సాయి పల్లవి.
Sai Pallavi in Mythri Movie Makers Banner
తాజాగా తనకు సంబంధించి మంచి కథను మైత్రీ మూవీ మేకర్స్ వినిపించారని, దానికి తను కూడా ఆసక్తి చూపించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తను నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది ఈ మూవీ. అద్భుతమైన కథ, అంతకు మించిన సంగీతంతో పాటు భావోద్వేగాలను పలికించిన తీరుకు సాయి పల్లవికి(Sai Pallavi) మంచి మార్కులు పడ్డాయి. చైతూతో తన కాంబినేషన్ వర్కవుట్ కావడంతో ఈ మూవీ కూడా ఆశించిన దానికంటే బాగా ఆడింది.
అంతకు ముందు అమరన్ తమిళ మూవీలో కీ రోల్ పోషించింది. ఇది సైన్యం నేపథ్యంగా వచ్చింది. సైనికులకు నివాళులు కూడా అర్పించింది. ఇక మూవీ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ లు సాయి పల్లవిని కలిశారని, మహిళా సెంట్రిక్ గా కథ వినిపించారని అందుకు బాగుండడం, తనకు నచ్చడంతో సరే అన్నట్టు సమాచారం. రాబోయే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సాయి పల్లవి ప్రస్తుతం హిందీ చిత్రం రామాయణంతో బిజీగా ఉంది. మరో మూవీ ఏక్ దిన్ లో కీ రోల్ పోషిస్తోంది.
Also Read : Popular Actor Vadivelu :నవ్వుల నజరానా గ్యాంగర్స్ థిల్లానా