Salaar Movie : యుఎస్ లో స‌లార్ అడ్వాన్స్ బుకింగ్

రూ. 3.46 కోట్ల క‌లెక్ష‌న్స్ తో రికార్డ్ బ్రేక్

Salaar Movie : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇక ముంద‌స్తు షోస్ కోసం అమెరికాలో భారీ పోటీ నెల‌కొంది. ముంద‌స్తు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

Salaar Movie Viral in USA

అడ్వాన్స్ సేల్స్ రూపేణా మూవీ మేక‌ర్స్ కు రూ 3.46 కోట్లు కొల్ల‌గొట్టింది. అమెరికాలోని 337 లొకేష‌న్స్ లో స‌లార్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మొత్తం 1012 షోస్ ప్ర‌ద‌ర్శిస్తారు ఆయా థియేట‌ర్ల‌లో. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 14,619 టికెట్లు అమ్డు పోయిన‌ట్లు మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ క‌న్న‌డ న‌టుడు య‌శ్ తో కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 తీశాడు. కోట్లు కొల్ల‌గొట్టింది ఈ చిత్రం. ప్ర‌త్యేకించి ద‌ర్శ‌క‌త్వ‌పు ప్ర‌తిభ ఏమిట‌నేది తెలిసి పోయింది. దీంతో డార్లింగ్ ప్ర‌భాస్ తో తీసుకున్న స‌లార్(Salaar) పై పెద్ద ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి.

కోలార్ గ‌నుల క‌థను తీసుకుని కేజీఎఫ్ తెర‌కెక్కించాడు. ఇక ప్ర‌భాస్ న‌టించిన ఆది పురుష్ విడుద‌లైంది. మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం రిలీజ్ కాబోయే త‌దుప‌రి చిత్రం స‌లార్ పై ఎక్కువ‌గా అంచ‌నాలు పెట్టుకున్నాడు. మొత్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ప్ర‌త్యేకించి అమెరికాలో రికార్డుల మోత మోగిస్తోంది విడుద‌ల కాకుండానే.

Also Read : Jailer Movie : ర‌జ‌నీ మేనియా మామ‌లుగా లేదుగా

salaar prashant neel prabhas shruti hasan
Comments (0)
Add Comment