Hero Salmaan Khan :అమ‌ర‌న్ ద‌ర్శ‌కుడితో స‌ల్మాన్ భాయ్

మ‌రో సౌత్ డైరెక్ట‌ర్ కు ఓకే చెప్పిన యాక్ట‌ర్

Salmaan Khan : బాలీవుడ్ లో సీన్ మారింది. ఒక‌ప్పుడు హిందీలో టాప్ లో ఉన్న సినిమాల‌ను తెలుగు, త‌మిళం, క‌న్న‌డ సినిమాల‌లోకి డ‌బ్ చేయ‌డమో లేదా ఆ క‌థ‌ల‌ను ఇక్క‌డ తెర‌కెక్కించే ప‌నిలో ఉండే వారు. కానీ ఎప్పుడైతే ఎస్ఎస్ రాజ‌మౌళి , సుకుమార్ చేసిన సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావ‌డం మొద‌లైందో ద‌క్షిణాది సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌డం ప్రారంభించారు. ఇక్క‌డ మార్కెట్ కు డిమాండ్ ఉండ‌డంతో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ద‌క్షిణాదికి చెందిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

Salmaan Khan Movie With

ఇప్ప‌టికే టాప్ డైరెక్ట‌ర్ల‌లో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు కూడా ఉన్నారు. అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరో షారుక్ ఖాన్ , దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తితో జ‌వాన్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. మ‌రో ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ గ‌తంలో అమీర్ ఖాన్ తో గ‌జిని తీశాడు. అది బిగ్ స‌క్సెస్ అయ్యింది. తాజాగా కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి సికంద‌ర్ తీశాడు. ఇది మార్చి 30వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సినిమా టీజ‌ర్ , ట్రైల‌ర్ మూవీకి మంచి స్పంద‌న ల‌భించింది. ఇదే స‌మ‌యంలో త‌న త‌దుప‌రి చిత్రం కోసం మ‌రో త‌మిళ సినీ ద‌ర్శ‌కుడితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు టాక్. అమ‌ర‌న్ మూవీతో దేశ వ్యాప్తంగా పేరు పొందాడు ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ పెరియ‌సామి(Rajkumar Periasamy). త‌ను క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ని, దినికి స‌ల్మాన్ ఖాన్ ఫుల్ ఫిదా అయ్యాడ‌ని, వెంట‌నే ఓకే కూడా చెప్పాడ‌ని జోరుగా ప్రచారం అందుకుంది.

Also Read : Rowdy Boy- Beauty Keerthy :మ‌రోసారి రౌడీతో జ‌త క‌ట్టేందుకు కీర్తి సై 

AmaranCinemaDirectorSalmaan KhanUpdatesViral
Comments (0)
Add Comment