Sikandar : ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం సికందర్. గత నెల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. గతంలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో గజిని తీశాడు. చాన్నాళ్ల తర్వాత కండల వీరుడితో ట్రై చేశాడు. కానీ దర్శకుడిగా మెప్పించ లేక పోయాడు. ఇదే సమయంలో షారుక్ ఖాన్ తో తమిళ సినీ రంగానికి చెందిన దర్శకుడు అట్లీ కుమార్ జవాన్ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. కానీ మురుగదాస్ ఎందుకనో ఫోకస్ పెట్టలేదని టాక్.
Sikandar Movie OTT Updates
బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బొక్క బోర్లా పడింది. నిర్మాత ఆశలపై నీళ్లు చల్లింది. స్టార్ ఇమేజ్ ఏమాత్రం సేవ్ చేయలేక పోయింది సికందర్(Sikandar) ను . ఓ వైపు బాలీవుడ్ సూపర్ స్టార్ , ఇంకో వైపు అందాల ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ పోషించినా చివరకు నిరాశే మిగిలింది. తను నటించిన పుష్ప 2, ఛావా, యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ సికందర్ మూవీ వచ్చే సరికి నెగటివ్ టాక్ తో ఇబ్బంది పడింది.
కనీసం రూ. 200 కోట్లు వస్తాయని ఆశించారు మూవీ మేకర్స్. కానీ అవి కూడా వచ్చే పరిస్థితి లేదని టాక్. ఇక సల్మాన్ ఖాన్, దర్శకుడు, చిత్ర బృందం సికిందర్ చిత్రం ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నా ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లడంలో సక్సెస్ కాలేక పోయారు. పాటలు, టీజర్, ట్రైలర్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. మొత్తంగా సినిమా ఫెయిల్. కానీ సల్మాన్ ఖాన్, రష్మిక ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పారు మేకర్స్. త్వరలోనే ఓటీటీలోకి సికందర్ రానుంది. కానీ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు.
Also Read : Hansika Motwani Sensational :గృహ హింస కేసు నుంచి తప్పించండి