Samantha Shocking :రాజ్ తో బంధం స‌మంత సంతోషం

శుభం మూవీ స‌క్సెస్ తో మ‌రింత జోష్

Samantha : మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు న‌టి స‌మంత రుత్ ప్ర‌భు(Samantha), ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరు. ఈ ఇద్ద‌రూ ఈ మ‌ధ్య తెగ వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. న‌టిగా సినిమాల‌లో బిజీగా ఉంటూనే ఇంకో వైపు అందివ‌చ్చిన ఛాన్స్ ల‌ను వ‌దులు కోవ‌డం లేదు. త‌ను పాడ్ కాస్ట్ కూడా చేస్తోంది స‌మంత‌. ఇదే క్ర‌మంలో వెబ్ సీరీస్ లో కూడా న‌టిస్తోంది. త‌న జీవితాన్ని మ‌రింత ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటూ ముందుకు సాగుతోంది. ఓ వైపు మాన‌సికంగా, శారీర‌కంగా ఇబ్బందులు ప‌డ‌డంతో కొంత గ్యాప్ ఇచ్చింది.

Samantha Shocking Comments on Dating

సుకుమార్ తీసిన పుష్ప మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో రెచ్చి పోయింది. ఊ అంటావా సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇందులో బ‌న్నీతో పోటీ ప‌డి న‌టించింది. మంచి మార్కులు ప‌డ్డాయి. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌ను నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చింది. శుభమ్ సినిమా తీసింది. ఇది మే 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. పూర్తిగా త‌క్కువ బ‌డ్జెట్ తో దీనిని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ఏడు రోజుల్లో దాదాపు రూ. 7 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా శుభం మూవీ స‌క్సెస్ ను స‌మంత రుత్ ప్ర‌భు, రాజ్ నిడిమోరు క‌లిసి పంచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇద్ద‌రూ కొంత కాలంగా డేటింగ్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా త‌మ బంధం మ‌రింత బ‌లోపేతంగా మారిందంటూ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇద్ద‌రూ క‌లిసి తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు. త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌న్న మాట‌.

Also Read : IPL 2025-SA Players Shocking :ప్లే ఆఫ్స్ కు సౌతాఫ్రికా ఆట‌గాళ్లు దూరం

CommentsDating RumoursSamantha Ruth PrabhuShockingViral
Comments (0)
Add Comment