Nazriya Nazim Sensational : న‌జ్రియా న‌జీమ్ కు స‌మంత స‌పోర్ట్

మాన‌సిక సంతృప్తి అత్యంత ముఖ్యం

Nazriya Nazim : మ‌ల‌యాళ న‌టి న‌జ్రియా న‌జీమ్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను గ‌త కొంత కాలంగా సామాజిక మాధ్య‌మాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో త‌న‌కు ఆరోగ్యం బాగో లేద‌ని కొంద‌రు పేర్కొంటే మ‌రికొంద‌రు త‌న వైవాహిక బంధంలో ఏదో కొంత గ్యాప్ ఏర్ప‌డింద‌ని, అందుకే త‌ను స్పందించ‌డం లేదంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది న‌జ్రియా న‌జీమ్(Nazriya Nazim) కు ఏమైందంటూ ఆందోళ‌న చెందుతున్నారు. ఈ త‌రుణంలో సినీ రంగానికి చెందిన ప‌లువురు సినీ న‌టులు న‌జ్రియాకు మ‌ద్ద‌తుగా నిలిచారు.

Nazriya Nazim Sensational

తాజాగా పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌మ‌కు కూడా మ‌న‌సు అనేది ఉంటుంద‌ని, గాయాలు, క‌ష్టాలు, క‌న్నీళ్లు కూడా ఉంటాయ‌ని పేర్కొంది. త‌మిళంలో ఎంట్రీ ఇచ్చింది. గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ తీసిన ఏమాయె చేశావే మూవీ త‌న‌ను న‌టిగా నిల‌బెట్టింది. త‌న‌కు స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకునేలా చేసింది. ఆ త‌ర్వాత నాగ చైత‌న్య‌తో ల‌వ్ , పెళ్లి, విడాకుల దాకా వెళ్లింది. త‌ను తీవ్ర‌మైన అనారోగ్యానికి గురైంది. ల‌క్ష‌ల్లో కొంద‌రికి మాత్ర‌మే అలాంటి వ్యాధి వ‌స్తుంద‌ని త‌నే వెల్ల‌డించింది.

దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు తనంత‌కు తానుగా మ‌నో ధైర్యాన్ని క‌లిగి ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తోంది. ధ్యానం, యోగాను ఆశ్ర‌యించింది స‌మంత రుత్ ప్ర‌భు. ఇక న‌జ్రియా భ‌ర్త ప్ర‌ముఖ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్ . తామిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ స్ప‌ష్టం చేసింది. ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించింది. ప్ర‌తి స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని పేర్కొంది. స‌మంత‌తో పాటు పార్వ‌తి తిరువోతు, విజ‌య్ వ‌ర్మ‌, బాసిల్ జోసెఫ్ తో పాటు న‌టులు తాము కూడా మ‌ద్ద‌తు ప‌లికారు.

Also Read : Vijayashanthi Shocking Comments :త‌ప్పుడు ప్ర‌చారం రాములమ్మ ఆగ్ర‌హం 

Nazriya NazimSamantha Ruth PrabhuUpdatesViral
Comments (0)
Add Comment