Shubham : పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన నటి సమంత రుత్ ప్రభు తొలిసారిగా నిర్మాతగా శుభం(Shubham) చిత్రాన్ని నిర్మించింది. విచిత్రం ఏమిటంటే మూవీ మేకర్స్ ఈ సినిమాకు శుభం అని పేరు పెట్టారు. కానీ పూర్తిగా హారర్ నేపథ్యంగా తీశారు. మరి ఈ చిత్రం ద్వారా సమాజానికి ఏం మెస్సేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో దర్శక, నిర్మాతలకే తెలియాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మే 9వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. స్వయంగా సమంత దీనిని ప్రమోట్ చేసే బాధ్యతను చూస్తున్నారు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉండడంతో సినిమాపై బజ్ పెరిగేలా చేసింది.
Shubham Movie Updates
కానీ సినిమాలో గనుక కంటెంట్ గనుక లేక పోతే పక్కన పెడతారని ఇటీవల చాలా మంది స్టార్లు అని భ్రమ పడుతున్న వాళ్లకు తెలిసొచ్చింది. దీంతో ఎంత పెద్ద హీరో, హీరోయిన్లు అయినా ముందుగా సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో బలమైన కథతో పాటు తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా పాత్రలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సమంత గతంలో పలు సినిమాలలో తను నటిగా ప్రూవ్ చేసుకుంది. తను నటించిన ఏమాయ చేశావే మూవీ ఇప్పటికీ క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీనికి స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు.
ఇందులో జెస్సీ పాత్రలో మెస్మరైజ్ చేసింది సమంత. తను ప్రస్తుతం మూవీస్ తో పాటు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా శుభం నిర్మించింది. ఇందులో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ , శ్రావణి కీలక పాత్రల్లో నటించారు. దీనిని హైదరాబాద్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా బండి పేరుతో సినిమా తీసి సక్సెస్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల శుభంను తీశాడ ఉ. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.
Also Read : Sarangapani Jathakam Success : సారంగపాణి జాతకం నాకో వరం