Samantha : ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ సందర్బంగా తన కెరీర్ గురించి పంచుకున్నారు. గత ఏడాది భారీ ఎత్తున బ్రాండ్స్ లలో నటించేందుకు ఛాన్స్ లు వచ్చాయని కానీ వాటిని తిరస్కరించానని చెప్పింది. దీనికి కారణం ఒకటి ఉందని ఆదాయం కంటే తాను ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించానని, అందుకే నిత్యం ధ్యానం, యోగం ముఖ్యమని వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. విచిత్రం ఏమిటంటే ఇండియాలో టాప్ బ్రాండ్స్ కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయని, 15కి పైగా ఇందులో ఉన్నాయని స్పష్టం చేసింది సమంత రుత్ ప్రభు.
Samantha Ruth Prabhu Rejects
కోట్లు ఇస్తామని ముందుకు వచ్చినా డోంట్ కేర్ అన్నానని పేర్కొంది. ఈ రకంగా చూస్తే తాను కోట్లు కోల్పోయానని చెప్పింది సమంత రుత్ ప్రభు(Samantha). కొన్న నా వ్యక్తిగతానికి సరి పోలేదని భావించానని, అందుకే వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని పేర్కొంది. ఇదిలా ఉండగా సమంత 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తను నాగ చైతన్యతో కలిసి చేసిన ఏమాయ చేశావే మూవీ బిగ్ హిట్ గా నిలిచింది. దీనిని గౌతమ్ వాసుదేవ మీనన్ తీశాడు.
ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు పోయింది. ఇటు తమిళంలో అటు తెలుగులో ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం కూడా బిజీగా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సీరీస్ లలో తను నటించి మెప్పించింది. తాజాగా బ్రాండ్స్ ఎండార్స్ మెంట్స్ పై తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎంతైనా ఆదాయం కంటే హెల్త్ ముఖ్యం కదూ..ఇది మిగతా హీరోయిన్లు కూడా పాటిస్తే మంచిది.
Also Read : Popular Director Murugadas :సెప్టెంబర్ లో రానున్న మదరాసి