Samantha Shocking :స్వేచ్ఛ అవ‌స‌రం లేక‌పోతే జీవితం వ్య‌ర్థం

ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు

Samantha : నేష‌న‌ల్ బ్యూటీ స‌మంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను స్వేచ్ఛ‌గా బ‌త‌కాల‌ని అనుకుంటాన‌ని, ఇంకొక‌రు త‌న‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూసినా, లేక నిబంధ‌న‌లు విధించాల‌ని చూసినా ఒప్పుకోనంటూ స్ప‌ష్టం చేసింది. త‌న‌కు తానుగా ఎలా బ‌త‌కాల‌ని అనిపిస్తే అలా ఉండాల‌ని అనుకుంటాన‌ని, ఒక‌రికి న‌చ్చిన‌ట్టు ఉండాల‌ని అనుకోనంటూ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ‌. విజ‌యం అంటే గెల‌వ‌డం మాత్ర‌మే కాద‌ని ప్ర‌య‌త్నించ‌డ‌మూ స‌క్సెస్ లో భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది.

Samantha Shocking Comments

రివార్డులు వ‌స్తే కాదు త‌న‌కు న‌చ్చిన‌ట్టు బ‌త‌క‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పింది స‌మంత రుత్ ప్ర‌భు(Samantha). ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఈవెంట్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది బ్యూటీ. తాను ఏనాడూ సినిమాల‌లో ఛాన్స్ లు కావాల‌ని ఎవ‌రినీ అడుక్కోలేద‌ని చెప్పింది. జీవితంలో అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను పోషించాల‌ని కోరిక ఉంద‌ని తెలిపింది.

జీవితం ఒక్క‌సారే వ‌స్తుంద‌ని, తాను ఎవ‌రి గురించి ప్ర‌త్యేకంగా ఆలోచించ‌నంటూ పేర్కొంది. చాలా మంది తెలుగులో ఎందుకు న‌టించడం లేదంటున్నార‌ని, త్వ‌ర‌లోనే న‌టించేందుకు రెడీగా ఉన్నాన‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ స‌మంత రుత్ ప్ర‌భును ప‌రిచ‌యం చేశాడు. నాగ చైత‌న్య‌తో ఏమాయ చేశావే తో ఛాన్స్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత పుష్ప -1 చిత్రంలో బ‌న్నీతో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ చేశాడు.

Also Read : Dokka Seethamma Movie Sensational :ఆంధ్రుల అన్న‌పూర్ణ‌మ్మ ‘డొక్కా సీత‌మ్మ’

CommentsSamanthaViral
Comments (0)
Add Comment