Samantha Shocking :పీరియ‌డ్స్ స‌హజం ఆందోళ‌న అన‌వ‌స‌రం

న‌టి స‌మంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర కామెంట్స్

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్ర‌భు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మహిళ‌ల‌కు ప్ర‌తి నెలా వ‌చ్చే రుతుస్రావం (పీరియ‌డ్స్ ) కు సంబంధించి స్పందించింది. దీని గురించి ఎందుకు సిగ్గు ప‌డాల‌ని ప్ర‌శ్నించింది. దీనిపై ఇంకా చ‌ర్చించేందుకు, త‌మ ఇబ్బందుల గురించి చెప్పేందుకు యువ‌తులు, బాలిక‌లు, మ‌హిళ‌లు ముందుకు రావ‌డం లేదంటూ వాపోయింది. దీనిపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డింది. లేక పోతే తీవ్ర న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉందంటూ పేర్కొంది స‌మంత(Samantha) రుత్ ప్ర‌భు.

Samantha Shocking Comments on Periods

త‌న పాడ్ కాస్ట్ లో డైటిస్ట్ రాశి చౌద‌రితో క‌లిసి పీరియ‌డ్స్ , సైకిల్ సింకింగ్, ఎండోమెట్రియోసిస్ తో పాటు మ‌హిళ‌లు నిత్యం ఎదుర్కొనే రోజూ వారీ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై కూడా ప్ర‌స్తావించింది న‌టి. టెక్నాల‌జీ ప‌రంగా ఎంతో ముందుకు వెళ్లిన‌ప్ప‌టికీ ఇంకా యువ‌తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసిందంటూ వాపోయింది స‌మంత రుత్ ప్ర‌భు. పీరియ‌డ్స్ అంటేనే అదేదో త‌ప్పు చేసిన‌ట్లు కొంద‌రు భావిస్తున్నార‌ని, ఆ విష‌యం తాను స్వ‌త‌హాగా అనుభ‌వించాన‌ని తెలిపింది.

రాశి చౌదరితో మాట్లాడటం వల్ల ఈ నిషేధాలను, పాత భావనలను విచ్ఛిన్నం చేయడం ఎంత కీలకమో నాకు గుర్తుకు వచ్చిందని తెలిపింది స‌మంత రుత్ ప్ర‌భు. మన చక్రాలు శక్తివంతమైనవని, ముఖ్యంగా, జీవితాన్ని ధృవీకరించేవని పేర్కొంది. ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన లేదా దాచాల్సిన విషయం కానే కాదంటూ స్ప‌ష్టం చేసింది. సమంత తన శరీరంతో తనకున్న సంబంధం, దాని గురించి నేర్చుకోవడంతో పాటు ఎండోమెట్రియోసిస్ వంటి బలహీనపరిచే విషయాన్ని ఎదుర్కొంటూ ప్రజల దృష్టిలో స్త్రీగా ఉండటం వల్ల వచ్చే సవాళ్ల గురించి వెల్లడించింది.

Also Read : Hero Pawan Kalyan-OG :త్వ‌ర‌లోనే ప‌వ‌న్ కళ్యాణ్ ఓజీ ఫ‌స్ట్ సింగిల్

CommentsSamantha Ruth PrabhuViral
Comments (0)
Add Comment