Samantha Sensational :రాహుల్ ర‌వీంద్ర‌న్ తో బంధం అద్బుతం

షాకింగ్ కామెంట్స్ చేసిన స‌మంత రుత్

Samantha : సినీ జ‌ర్నీలో ఎంద‌రో క‌లుస్తుంటారు. ఇంకెంద‌రో మ‌న‌కు ఆప్తులుగా అనిపిస్తారు. ఇంకొంద‌రు మ‌న‌ల్ని విడిచి వెళ్లినా జ్ఞాప‌కాల్లోనిత్యం క‌ద‌లాడుతూనే ఉంటారు. అలాంటి వారిని ఎలా మ‌రిచి పోగ‌లం నిత్యం స్మ‌రించు కోవ‌డమే త‌ప్పా అంటూ వేదాంత ధోర‌ణితో చెప్పింది పాన్ ఇండియ‌న్ హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు. త‌ను తాజాగా గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకుంది. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది. త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను నిర్భ‌యంగా పంచుకుంది. ఏ ఒక్క‌రికీ ర‌హ‌స్యాలు అనేవి ఎందుకుండాలంటూ ప్ర‌శ్నించింది.

Samantha Sensational Comments

లైఫ్ ఒక్క‌టే. దానిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాల‌ని స్ప‌ష్టం చేసింది స‌మంత రుత్ ప్ర‌భు(Samantha). ఈ సంద‌ర్బంగా త‌న కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకునే ఓ వ్య‌క్తి ఉన్నాడ‌ని, అత‌ను ఎవ‌రో కాదు రాహుల్ ర‌వీంద్ర‌న్ అని మ‌న‌సులోని మాట బ‌య‌ట పెట్టింది. త‌ను న‌టుడు, ద‌ర్శ‌కుడు. అంత‌కు మించి గొప్ప స్నేహితుడు. త‌ను ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు, మాన‌సికంగా చితికి పోయిన‌ప్పుడు ఆస‌రాగా ఉన్నాడు. భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న‌ను ఎలా మ‌రిచి ఉండ‌గ‌ల‌నంటూ వాపోయింది. ఇదే స‌మ‌యంలో త‌న‌తో బంధం అద్భుత‌మ‌ని, దీని గురించి ఇంత‌కంటే ఇంకేం చెప్ప‌లేనంటూ పేర్కొంది న‌టి.

ఆ మ‌ధ్య నేను ఆరోగ్య ప‌రంగా చాలా ఇబ్బందులు ప‌డ్డా. ఈ స‌మ‌యంలో నేను ఒక్క‌దాన్నే ఉన్నాను. నాతో ఎవ‌రూ లేర‌నే బెంగ క‌లిగింది. ఈ స‌మ‌యంలో విష‌యం తెలుసుకున్న వెంట‌నే రాహుల్ ర‌వీంద్ర‌న్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. న‌న్ను జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడు. త‌ను ఫ్రెండ్ మాత్ర‌మే కాదు అంత‌కు మించిన బంధం మా ఇద్ద‌రి మ‌ధ్య ఉంద‌ని తెలిపింది. త‌ను కుటుంబంలో ఒక‌డు. అంతే కాదు త‌న‌కు అన్నీ తానేనంటూ స్ప‌ష్టం చేసింది స‌మంత రుత్ ప్ర‌భు.

Also Read : Hero Akhil Movie : లెనిన్ యాక్ష‌న్ సీన్స్ లో అఖిల్ బిజీ

CommentsRahul RavindranSamantha Ruth PrabhuViral
Comments (0)
Add Comment