Shubham Movie Success :శుభం స‌క్సెస్ సమంత ఖుష్

హార‌ర్..కామెడీ నేప‌థ్యంగా చిత్రం

Shubham : ఇటు న‌టిగా బిజీగా ఉంటూనే మ‌రో వైపు నిర్మాత‌గా మారి తీసిన చిత్రం శుభం. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా మంచి స్పంద‌న ల‌భించింది. ఈ చిత్రాన్ని త‌న భుజాల మీద పెట్టుకుని మోసింది. పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న్స్ చేప‌ట్టింది. అద్భుతంగా వినోదాన్ని పంచేలా చేసింది. శుభం మూవీలో హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీ‌నివాస్ , స‌మంత‌(Samantha), శ్రియ కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని, చ‌ర‌ణ్ పెరి న‌టించారు. ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేశారు. న‌వ్వులు పూయించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీనికి ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కాండ్రేగుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించాలి.

Shubham Movie Success Talk

శుభం చిత్రానికి షోర్ పోలీస్ ఇచ్చిన సంగీతం ప్ల‌స్ పాయింట్ గా మారింది. సినిమాటోగ్రాఫ‌ర్ మృదుల్ సుజిత్ సేన్ బ‌లంగా మారాడ‌డు. గ‌తంలో సినిమా బండి తీశాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం బిగ్ హిట్ గా నిలిచింది. 2000 నాటి క‌థ‌ను తీసుకుని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఉంది శుభం(Shubham). హ‌ర్షిత‌, శ్రియ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌మ్మ‌క‌మైన భార్య‌ల పాత్రలు పోషించారు.

క‌థా ప‌రంగా బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ రెండో పార్ట్ ఆక‌ట్టుకునేలా తీశాడు ద‌ర్శ‌కుడు. శుభం సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. త‌ను సినిమాలో అతిథి పాత్ర పోషించింది. సంభాష‌ణ‌లు ప్ల‌స్ పాయింట్ గా నిలిచాయి. మొత్తంగా శుభం చిత్రం హాస్యం, తేలిక‌పాటి భ‌యాన‌క‌త‌ను మిళితం చేసి తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు కాండ్రేగుల‌. కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ మూవీ వినోదాన్ని పంచ‌డంలో రిలీఫ్ ఇచ్చేలా చేసింది.

Also Read : Single Success Talk :సింగిల్ న‌వ్వుల్ న‌వ్వుల్ హ‌ల్ చ‌ల్

CinemaSamantha Ruth PrabhuShubhamTrendingUpdates
Comments (0)
Add Comment