Beauty Samantha-Shubham :ఆశాజ‌న‌కంగా శుభ‌మ్ క‌లెక్ష‌న్స్

రూ. 5.25 కోట్ల‌కు పైగా వ‌సూలు

Shubham : ప్ర‌ముఖ న‌టి స‌మంత నిర్మించిన చిత్రం శుభ‌మ్. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంచ‌నాలు దాటేసి దూసుకు పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న చిత్రంగా వ‌చ్చినా రూ. 5.25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విస్తు పోయేలా చేసింది. ఓ వైపు ల‌వ్లీ బ్యూటీ సినిమాల‌లో న‌టిస్తూనే ఇంకో వైపు వెబ్ సీరీస్ లో కీ రోల్ పోషిస్తోంది. ఇదే స‌మ‌యంలో తాజాగా నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చింది.

Shubham Movie Collections

త‌ను మాన‌సికంగా, శారీర‌కంగా తీవ్ర ఇబ్బందులు ప‌డింది. ఆ త‌ర్వాత కొంత కోలుకుంది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌ను ఏరికోరి శుభ‌మ్(Shubham) ను నిర్మించింది. ఈ చిత్రం మే 9న విడుద‌లైంది. విచిత్రం ఏమిటంటే అన్ని వ‌ర్గాల వారు ఆద‌రిస్తుండ‌డం. సానుకూల‌మైన స్పంద‌న ల‌భించింది . తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో కాసుల వ‌ర్షం కురుస్తోంది.

ఇటు ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా మంచి ఆద‌ర‌ణ చూర‌గొంది. ఈ సంద‌ర్బంగా శుభమ్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల స్పందించింది న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. చిత్రాన్ని ఆద‌రించినందుకు ఆనందంగా ఉంద‌ని తెలిపింది. శుభ‌మ్ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంథం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ నటించారు. స‌మంత అతిథి పాత్ర‌లో న‌టించింది.

Also Read : Hero Ram Charan-Peddi :శ‌ర వేగంగా చెర్రీ పెద్ది షూటింగ్

CinemaSamantha Ruth PrabhuShubhamUpdatesViral
Comments (0)
Add Comment