Beauty Samantha :అంత‌టా శుభం స‌మంత సంతోషం

సినిమాకు అంత‌టా పాజిటివ్ టాక్

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు ఓ వైపు న‌టిస్తూనే ఇంకో వైపు నిర్మాత‌గా మారింది. సినీ రంగానికి చెందిన ప‌లువురు హీరో, హీరోయిన్లు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా త‌ను టాలీవుడ్ లో శుభం చిత్రాన్ని నిర్మించింది. ఈ సంద‌ర్బంగా స్వంతంగా బ్యాన‌ర్ త్ర‌లాలా మూవీ పిక్చ‌ర్స్ పేరుతో ఏర్పాటు చేసింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సినిమా. దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది న‌టి స‌మంత రుత్ ప్ర‌భు.

Samantha Shubham Movie Updates

ఈ శుభం సినిమాకు యంగ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రంపై త‌ను పూర్తిగా ఫోక‌స్ పెట్టింది. మూవీ రిలీజ్ కు సంబంధించి స‌మంత అన్నీ తానై వ్య‌వ‌హ‌రించింది. సినిమా ప్ర‌మోష‌న్స్ ను పెద్ద ఎత్తున చేప‌ట్టారు. స‌మంత‌కు(Samantha) పెద్ద ఎత్తున స‌పోర్ట్ ల‌భిస్తోంది. త‌ను కూడా సినిమా ప్రమోషన్లకు మద్దతు ఇవ్వడానికి తన స్నేహితులను కలుపుకుంటోంది.

హాస్యనటుడు వెన్నెల కిషోర్ తో ఇటీవల ఒక సరదా వీడియోలో, ఆమె అతనిని నువ్వు నా సినిమా శుభం ప్రీమియర్ కి రావడం లేదా అని అడుగుతున్నట్లు కనిపించింది. ఈ సంద‌ర్బంగా అరుదైన వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వెన్నెల కిషోర్ కు శుభం అని ఒకే ఒక్క ఫోన్ కాల్ లో చెప్పానంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ‌.

Also Read : Hero Rajinikanth Craze :ఏజ్ పెరిగినా క్రేజ్ త‌గ్గ‌ని త‌లైవా

Samantha Ruth PrabhuShubhamUpdatesViral
Comments (0)
Add Comment