Samantha-Citadel : ఓటీటీలో సమంత నటించిన అవైటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’

ఎఫ్‌బీఐ,ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటాడెల్‌ అనేది ఒక స్పై ఏజెన్సీ...

Samantha : సమంత ప్రస్తుతం తాను నటించిన మోస్ట్‌ అవైటింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ రూపొందింది. ఇందులో సమంత(Samantha) హనీ పాత్రలో స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఇటీవల దీని ట్రైలర్‌ విడుదల చేయగా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. వరుణ్‌ ధావన్‌ కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ నేడు (నవంబర్‌ 7)లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది.

Samantha-Citadel Honey Bunny OTT…

ఎఫ్‌బీఐ,ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటాడెల్‌ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్‌లో దీనిని స్థాపిస్తారు. ఒక్క దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి సంరక్షణ బాధ్యత ప్రధాన లక్ష్యంగా ఈ ఏజన్సీ పనిచేస్తుంది. ‘సిటాడెల్‌’ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు ధనిక బృందాలు కలిసి ‘మాంటికోర్‌’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటడెల్‌లో టాప్‌ స్పై ఏజెంట్లు అయిన మేసన్‌ కేన్‌ (రిచర్డ్‌ మ్యాడెన్‌), నదియా సిన్హ్‌ను తప్పుదోవ పట్టించి వాళ్లను అంతం చేసేందుకు మాంటికోర్‌ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి మేసన్‌, నదియా ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటాడెల్‌ను పునరుద్థరించి, మాంటికోర్‌ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి? అన్నది కథ.

Also Read : Anushka Shetty : చాన్నాళ్లకు వెండితెరపై కనిపించనున్న స్వీటీ

CitadelOTTSamantha Ruth PrabhuTrendingUpdatesViralWeb Series
Comments (0)
Add Comment