Sampoornesh Babu Sensational :అన్న‌ద‌మ్ముల అనుబంధం శాశ్వ‌తం 

క‌థా నాయ‌కుడు సంపూర్ణేశ్ బాబు 

Sampoornesh Babu : సోద‌రుల మ‌ధ్య ఉన్న బంధాన్ని హైలెట్ చేస్తూ వ‌స్తున్న చిత్రం సోద‌రా. ఈ సినిమాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు న‌టుడు సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu). ఇందులో మ‌రో కీ రోల్ పోషిస్తున్నాడు సంజోష్. వీరు అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పూర్తిగా కుటుంబ బాంధ‌వ్యాలు, గ్రామీణ‌ నేప‌థ్యం ఆధారంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ మూవీకి మ‌న్ మెహ‌న్ మేనంప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Sampoornesh Babu Sensational Comments

క్యాన్ ఎంట‌ర్ టైన్ బ్యాన‌ర్ పై చంద్ర చ‌గంలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోద‌రా చిత్రం పోస్ట‌ర్, టీజ‌ర్ , సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని వెల్ల‌డించారు. ఇది పూర్తిగా మాన‌వ సంబంధాల గురించి చ‌ర్చిస్తుంది. అంతే కాదు అనుబంధం ప‌ట్ల ఉన్న విలువ ఏమిటో తెలియ చేస్తుంద‌న్నారు న‌టుడు సంపూర్ణేశ్ బాబు.

ఇది కుటుంబ క‌థ మాత్ర‌మే కాదు సోద‌రుల మ‌ధ్య విడ‌దీయ‌లేని క‌థ‌. భావోద్వేగాల‌ను ప్ర‌తిఫ‌లించేలా దర్శ‌కుడు దీనిని తెరెక్కించాడ‌ని అన్నారు. సోద‌రా ప్ర‌తి ఒక్క‌రినీ న‌వ్వించేలా చేస్తుంది..అంతే కాదు క‌న్నీళ్ల‌ను కూడా తెప్పిస్తుంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఉన్న బంధం గురించి ద‌ర్శ‌కుడు ప్ర‌త్యేకంగా ట్యాగ్ లైన్ కూడా పెట్టాడ‌ని తెలిపారు సంపూర్ణేశ్ బాబు. బ్రోమాంటిక్ అని ట్యాగ్ పెట్ట‌డం విశేషం. ఇలాంటి క‌థ‌తో ఏ సినిమా టాలీవుడ్ లో ఇప్ప‌టికీ రాలేద‌న్నారు. స‌క్సెస్ చేయాల‌ని కోరారు.

Also Read : Krishna Bhagavan- Hero Pawan :ద‌మ్మున్నోడు అనుకున్న‌ది సాధించాడు

CommentsSampoornesh BabuViral
Comments (0)
Add Comment