Sanam Theri Kasam Sensational :స‌న‌మ్ తేరి క‌స‌మ్ రీ రిలీజ్ వ‌సూళ్ల‌లో రికార్డ్

టికెట్ అమ్మ‌కాల‌తో సూప‌ర్ క్రేజ్

Sanam Theri Kasam : స‌నమ్ తేరి క‌స‌మ్ రీ రిలీజ్ బాక్సాఫీస్ ఓపెనింగ్ రికార్డ్ న‌మోదు చేసింది. టికెట్ అమ్మ‌కాల‌తో ఈ ఏడాది వ‌చ్చిన సినిమాల వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. హ‌ర్ష వ‌ర్ద‌న్ రాణే, మావ్రా హోకేన్ న‌టించారు ఈ చిత్రంలో. దీనిని ద‌ర్శ‌కుడు రొమాంటిక్ డ్రామా క‌థాంశంగా తెర‌కెక్కించాడు. తొలి రోజు టికెట్ల అమ్మ‌కాలతో రికార్డ్ సృష్టించింది. అక్ష‌య్ కుమార్ స్కై ఫోర్స్ మిన‌హా రిలీజ్ అయిన సినిమా వ‌సూళ్ల‌ను అధిగ‌మించ‌డం విశేషం.

Sanam Theri Kasam Movie Updates

ఫిబ్ర‌వ‌రి 7న స‌న‌మ్ తేరి క‌స‌మ్(Sanam Theri Kasam) చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ ఆద‌రిస్తున్నారు. మూడు రోజుల్లోనే సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. తిరిగి విడుదలైన చిత్రాల‌ను తోసి రాజ‌ని వ‌సూళ్లు సాధించ‌డం మూవీ మేక‌ర్స్ ను విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఈ మూవీ తొమ్మిది సంవ‌త్స‌రాల త‌ర్వాత విడుద‌ల కావ‌డం విశేషం. బాక్సాఫీస్ వ‌ద్ద అప్ప‌ట్లో డోల్తా ప‌డింది. కానీ 2025లో అనూహ్యంగా రీ రిలీజై చ‌రిత్ర సృష్టించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం కేవ‌లం రెండు రోజుల్లోనే రూ. 8 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. తొలి రోజున రూ. 4.25 కోట్లు వ‌సూలు చేసింది. రెండ‌వ రోజు రూ. 5 కోట్లు సాధించింది. ఇప్ప‌టికే స‌న‌మ్ తేరి క‌స‌మ్ మూవీ బుల్లి తెర‌పై, ఓటీటీలో విడుద‌లైంది. ఆ త‌ర్వాత జ‌నాద‌ర‌ణ పొందింది.

Also Read : Hero Prabhas-Brahma-Anandam :బ్ర‌హ్మ ఆనందంకు ‘డార్లింగ్..మెగా’ స‌పోర్ట్

CollectionsSanam Theri KasamTrendingUpdatesViral
Comments (0)
Add Comment