Spirit – Sandeep Reddy Vanga:స్పిరిట్ ప్రాజెక్టుపై సందీప్ రెడ్డి ఫోక‌స్

వంగా కండీష‌న్స్ అప్లై..ప్ర‌భాస్ కు షాక్

Sandeep Reddy Vanga : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి తీసింది కొన్ని చిత్రాలే . కానీ ప్ర‌తి మూవీ బ్లాక్ బ‌స్ట‌రే. త‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీసిన అర్జున్ రెడ్డి బిగ్ స‌క్సెస్. దానిని షాహీద్ క‌పూర్ తో హిందీలో తీశాడు. అక్క‌డ కూడా దుమ్ము రేపింది. ఆ త‌ర్వాత ర‌ణ బీర్ క‌పూర్, అనిల్ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్నా, బాబీ డియోల్ ..లాంటి బిగ్ స్టార్స్ తో యానిమ‌ల్ తీశాడు. ఇండియాను షేక్ చేసింది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ ఒక్క మూవీతో సినిమా రంగానికి దూర‌మై, తీవ్ర మానసిక క్షోభ‌కు గురైన బాబీ డియోల్ కు తిరిగి బూస్ట్ ఇచ్చాడు వంగా సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga). దెబ్బ‌కు ఇప్పుడు ఫుల్ బిజీగా మారాడు. త‌న డేట్స్ కోసం నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు.

Sandeep Reddy Vanga – Prabhas Spirit Movie

ఇదిలా ఉండ‌గా త‌దుప‌రి చిత్రం పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు. దీంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్ప‌టికే పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశాడు. స్పిరిట్ కు సంబంధించి స్క్రిప్ట్ పై ఫోక‌స్ పెట్టాడు. ప్ర‌స్తుతం త‌ను స‌మ్మ‌ర్ వెకేష‌న్ లో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్. ఇట‌లీలో ఎంజాయ్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు మారుతి తీస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న రాజా సాబ్ షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. టీజ‌ర్, పోస్ట‌ర్స్ కు మంచి ఆదర‌ణ ల‌భించింది. దీనిపై ఎక్కువ న‌మ్మ‌కం పెట్టుకున్నాడు ప్ర‌భాస్. ఇదే స‌మ‌యంలో నాగ్ అశ్విన్ క‌ల్కి 2 లో న‌టిస్తున్నాడు.

ఇక ప్ర‌భాస్ రాజా సాబ్ కు సంబంధించి కీల‌క స‌న్నివేశాలు తీయాల్సి ఉంది. ఇక స్పిరిట్ మూవీ కోసం వంగా సందీప్ రెడ్డి 65 రోజులు పూర్తిగా స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన‌ట్టు టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప్ర‌భాస్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడ‌ని, అంత‌లోపు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో మూవీ క‌థా చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్న‌ట్లు వినికిడి. మొత్తంగా వంగా స్పిరిట్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : Natural Star Nani-Hit 3 :నేచుర‌ల్ స్టార్ నాని హిట్ 3 సూప‌ర్ హిట్

CinemaPrabhasSandeep Reddy VangaSpiritTrendingUpdates
Comments (0)
Add Comment