Sankranthiki Vasthunam : విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. తను నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మాణ సారథ్యంలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి పండుగ సందర్బంగా సినిమాను రిలీజ్ చేశారు.
Sankranthiki Vasthunam Trending Collections
రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవ్వులు పూయించింది. ప్రేక్షకులను టాకీసుల వద్దకు వచ్చేలా చేసింది. ఈ మధ్య కాలంలో మూసిన థియేటర్లను తిరిగి తెరిపించేలా చేసింది ఈ మూవీ. ఇది కూడా విస్తు పోయే వాస్తవం.
వెంకటేశ్ తో డైరెక్టర్ కు ఇది మూడో మూవీ కావడం విశేషం. ఎఫ్2 బిగ్ హిట్ . సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 సూపర్ సక్సెస్. మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించి పెట్టింది వెంకీ మామకు.
ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. భార్య, మాజీ లవర్ మధ్య భర్త పడే పాట్లు ఉన్న పాత్రలో లీనమై నటించారు యాక్టర్. మాజీ లవర్ గా చాందిని చౌదరి, భార్య గా ఐశ్వర్య రాజేష్ తో పాటు మరో కీలకమైన పాత్రలో నటించాడు బుడ్డోడు బుల్లి రాజా. తన అసలు పేరు రేవంత్. వెంకీకి కొడుకుగా సూపర్ గా చేశాడు. మొత్తంగా కామెడీ కిక్కు ఇచ్చింది. నిర్మాతలు అధికారికంగా ఎక్స్ లో రూ. 303 కోట్లు వచ్చాయని ప్రకటించారు.
Also Read : KP Chowdhary Death :కబాలి నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య