Sarangapani Jathakam Sensational : న‌వ్వుల లోకం సారంగ‌పాణి జాత‌కం

పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది

Sarangapani Jathakam : ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సారంగ‌పాణి జాత‌కం విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ సంద‌ర్బంగా స‌క్సెస్ మీట్ చేప‌ట్టారు. చాలా రోజుల తరువాత నవ్వులతో థియేటర్ దద్దరిల్లి పోవడం ప్రత్యక్షంగా చూశానంటూ పేర్కొన్నారు ప్ర‌ముఖ న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి. సక్సెస్ ఫుల్ హీరో ప్రియదర్శి(Priyadarshi) , తెలుగు అమ్మాయి రూపా , వైవా వ‌ర్ష , వెన్నెల కిషోర్ క‌లిసి న‌టించిన ఈ మూవీ ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sarangapani Jathakam Movie Talk

స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించింది మూవీ టీం. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడారు. ప్రియదర్శి వెర్సటైల్ హీరో అని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆడియెన్స్ కూడా చెబుతున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ తో ఇది నా మూడో సినిమా. హ్యాట్రిక్ హిట్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు. సినిమా బాగుందని ఎంతో మంది ఫోన్‌లు, మెసెజ్‌లు చేస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. 20 ఏళ్లుగా నన్ను ఈ ప్రేక్షకులు ప్రేమిస్తూ, ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు.

సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌. ఈ ప్రయాణంలో నాకు తోడు నిలిచిన నా టీంకు థాంక్స్. రూపా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీనివాస్ అవసరాల చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్లిన తనికెళ్ల భరణి ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం. ఇది థియేటర్లోనే చూడాల్సిన చిత్రమ‌ని అన్నారు.

Also Read : Sarangapani Jathakam Sensational :ఆక‌ట్టుకున్న సారంగ‌పాణి జాత‌కం

CinemaPriyadarshi PulikondaSarangapani JathakamTrending
Comments (0)
Add Comment