ఓటీటీలో సారంగ‌పాణి జాత‌కం

నేటి నుంచే స్ట్రీమింగ్ షురూ

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఫీల్ గుడ్ మూవీ సారంగ‌పాణి జాత‌కం. ఇందులో పులికొండ ప్రియ‌ద‌ర్శి, తెలుగు అమ్మాయి హీరోయిన్ గా న‌టించింది. ఆద్యంత‌మూ న‌వ్వులు పూయించింది. హృద‌యాల‌ను తేలిక ప‌రిచేలా చేసింది. మొత్తంగా స‌క్సెస్ , పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంచ‌నాల‌కు అంద‌కుండానే పెట్టిన డ‌బ్బులు తిరిగి వ‌చ్చేలా చేసింది.

క‌థ ప‌రంగా బాగుంటే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా సినిమాను ఆద‌రిస్తార‌ని ఈ సినిమా విజ‌యం నిరూపించింది. ఇందులో ప్రియాద‌ర్శితో పాటు న‌వ్వులరేడు వెన్నెల కిషోర్ కూడా పండించిన న‌వ్వు క‌డుపుబ్బా, ఇంటిల్లిపాదిని న‌వ్వించింది. గుండెల‌ను మీటింది. ప్రేక్షకులను తొలి నుండి చివరి వరకు నవ్వించడమే లక్ష్యంగా స‌క్సెస్ అయ్యింది.

సారంగ‌పాణి జాత‌కం చిత్రాన్ని దివంగ‌త ద‌ర్శ‌కుడు జంధ్యాల‌కు హృదయ పూర్వ‌క‌మైన నివాళి అర్పించాడు. మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా ఓటీటీలో మాత్రం ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని మిస్ అయిన వాళ్ల‌కు మంచి ఛాన్స్ మ‌రోసారి చూసేందుకు . ఆహ్లాద‌క‌ర‌మైన సంభాష‌ణ‌లు న‌వ్వులు పూయించేలా చేశారు. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడు త‌న ర‌చ‌న‌లో అత్యుత్త‌మ చ‌మత్కారాన్ని పండించాడు. కామెడీ స‌న్నివేశాలు పూర్తిగా స‌హ‌జ సిద్దంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రైమ్ వీడియోలో ప్ర‌ద‌ర్శితం అవుతోంది. వీలైతే చూడండి.

Comments (0)
Add Comment