Sarangapani Jathakam : తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ కు ప్రయారిటీ ఇఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. అలాంటి వాటిలో ఈ ఏడాది విడుదలైన చిత్రాలు నిరూపించాయి. తక్కువ బడ్జెట్ తో రూపు దిద్దుకున్న మూవీస్ లలో తమిళ సినిమా దర్శకుడు మారిముత్తు తీసిన డ్రాగన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ నటన, అనుపమ పరమేశ్వరన్ , కయాదు లోహర్ ల పాత్రలు ప్రేక్షకులను, ప్రత్యేకించి యూత్ ను , అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చేసింది.
Sarangapani Jathakam Movie Collections
ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇక నేచురల్ స్టార్ నాని ఓ వైపు సినిమాలు తీస్తూనే మరో వైపు సినీ నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. తను నిర్మించిన తాజా చిత్రం కోర్ట్. ఇందులో ప్రియదర్శి , హర్ష వర్దన్, శివాజీ కీ రోల్స్ పోషించారు. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీ పరంగా ఏకంగా రూ. 8 కోట్లకు అమ్ముడు పోయింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించి, శివలెంక ప్రసాద్ నిర్మించిన సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) సక్సెస్ టాక్ అందుకుంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇందులో ప్రధాన పాత్రలలో అద్భుతంగా నటించారు ప్రియదర్శి సిరికొండ, రూపా కొడివాయర్ , వెన్నెల కిషోర్ , వైవా హర్షతో పాటు సీనియర్ నటుడు , రచయిత తనికెళ్ల భరణి. వీనుల విందైన సంగీతం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా దర్శక, నిర్మాతలతో పాటు నటీనటుల పర్ ఫార్మెన్స్ చిత్రం సక్సెస్ అయ్యేందుకు , కాసులు కురిపించేందుకు దోహద పడిందని చెప్పక తప్పదు.
Also Read : Hero Ranbir Ramayan : దీపావళి పర్వదినం రానున్న రామాయణం