Sarangapani Jathakam Success : సారంగ‌పాణి జాత‌కం నాకో వ‌రం

న‌టుడు ప్రియ‌ద‌ర్శి కామెంట్స్

Sarangapani Jathakam : ఇంటిల్లిపాది చూసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. హింస‌, శృంగారం, బూతులు డామినేట్ చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో మూవీ తీయాలంటే చాలా ధైర్యం చేయాలి. ఇందుకు ప్ర‌త్యేకంగా అభినందించి తీరాలి నిర్మాత శివ‌లెంక ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌ను. వీరి కాంబినేష‌న్ లో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సారంగ‌పాణి జాత‌కం(Sarangapani Jathakam). అంచ‌నాలు మించి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది ఈ చిత్రానికి. ఇక ఈ ఏడాదిలో వ‌చ్చిన లో బ‌డ్జెట్ సినిమాల‌లో మంచి మార్కులు కూడా కొట్టేసింది ఈ మూవీ.

Sarangapani Jathakam Movie Updates

ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, రూపా కొడియార్, వెన్నెల కిషోర్ , వైవా వ‌ర్ష‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, త‌దిత‌రులు. సినిమా స‌క్సెస్ టాక్ తెచ్చుకోవ‌డంతో మూవీ మేక‌ర్స్ , టీం పిచ్చాపాటి మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు న‌టుడు ప్రియ‌ద‌ర్శి. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో కీ రోల్ పోషించిన త‌న‌కు మంచి ఫీల్ గుడ్ క‌లిగించేలా చేశాయ‌ని అన్నాడు. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ కాగా ఇంద్రగంటి తీసిన సారంగ‌పాణి జాత‌కం.

సినీ రంగంలోకి వ‌స్తాన‌ని అనుకోలేదు. వ‌చ్చాక ఏదో ఒక రోజు ఇంద్ర‌గంటి, శివ‌లెంక కాంబినేష‌న్ లో చిన్న పాత్ర దొరికితే చాల‌ని అనుకున్నా. ఇది నా క‌ల‌గా ఉండేది. కానీ ఆ దేవుడు నాకు అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించాడు. ఇందులో న‌టించేలా నాకు అవ‌కాశం క‌ల్పించాడు. న‌న్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ఆస్కారం ఏర్ప‌డింద‌న్నాడు ప్రియ‌ద‌ర్శి. ప్ర‌తి న‌టుడికి కొన్ని పాత్ర‌లు చేయాల‌ని ఉంటుంది. ఒక్కోసారి వ‌స్తాయి..ఇంకోసారి దొర‌క‌వ‌ని కానీ త‌న‌కు మాత్రం ఈ రెండు సినిమాలు అద్భుత‌మైన సంతోషాన్ని మిగిల్చేలా చేశాయ‌ని అన్నాడు.

Also Read : Hero Nani-Mahabharat : మ‌హాభార‌తంలో నేచుర‌ల్ స్టార్ కు ఛాన్స్

CinemaSarangapani JathakamTrendingUpdates
Comments (0)
Add Comment