Satyadev Kancharana: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్ వచ్చేసింది !

సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్ వచ్చేసింది !

Satyadev Kancharana: బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించి మెగాస్టర్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా సెటిల్డ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్(Satyadev Kancharana). గతేడాది ‘గాడ్సే’ సినిమాతో వచ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన స‌త్య‌దేవ్.. ఈసారి మాస్ బొమ్మ ‘కృష్ణ‌మ్మ‌’తో వస్తున్నారు. సత్యదేవ్‌ కి జోడీగా అతీరారాజ్ నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణ‌మ్మ‌’తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను మే 3 గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Satyadev Kancharana Movie Updates

ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ… ‘‘రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు టైటిల్‌ ‘కృష్ణమ్మ’ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ… “స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్‌ సాంగ్‌ లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది” అని అన్నారు.

Also Read : Ramayana: నితేశ్ తివారీ ‘రామాయణ’ కోసం ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ !

KrishnammaSatyadev Kancharana
Comments (0)
Add Comment