Popular Actor Sethupathi-Rukmini :రుక్మిణి..సేతుప‌తి ఫీల్ గుడ్ సాంగ్ 

మెస్మ‌రైజ్ చేసిన ఏస్ పాట చిత్రీక‌ర‌ణ 

Sethupathi : కొంద‌రి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా త‌నంత‌కు తానుగా ప‌రిపూర్ణ‌మైన న‌టుడిగా మ‌ల్చుకున్నాడు త‌మిళ సినీ రంగానికి చెందిన విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi). ఆ మ‌ధ్య‌న తెలుగులో వ‌చ్చిన ఉప్పెన సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. త‌ను అందులో విల‌న్ పాత్ర పోషించాడు. ఏ  పాత్ర ఇచ్చినా స‌రే అందులో లీన‌మై పోవ‌డం త‌న హాబీ. ఒక్కోరిది ఒక్కో స్టైల్. జీవితం ప‌ట్ల ఎంతో అవ‌గాహ‌న‌, అనుభ‌వం క‌లిగిన ఈ యాక్ట‌ర్ కొత్త కొత్త పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

Sethupathi – Rukmini Movie Song

త‌ను తాజాగా న‌టించిన చిత్రం ఏస్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేసుకుంటూ పోయే విజ‌య్ సేతుప‌తి ఇందులో మాత్రం మ‌రీ స‌న్న‌బ‌డ్డాడు. యంగ్ హీరోగా క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందులో పాత్ర అలాంటిది మ‌రి. త‌ను ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన హీరో అని ఆ మ‌ధ్య‌నే చెప్పాడు ఓ పేరు పొందిన త‌మిళ సినీ డైరెక్ట‌ర్. ఇక విజ‌య్ , సేతుప‌తి కాంబినేష‌న్ సూప‌ర్. ఇద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. ఆ మ‌ధ్య‌న అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హిందీలో వ‌చ్చిన జ‌వాన్ లో విల‌నిజంతో ఆక‌ట్టుకున్నాడు.

త‌న‌ను చూసి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సైతం విస్తు పోయాడు. త‌న న‌ట‌న‌కు ఫిదా అయ్యాడు. ఏకంగా అంద‌రి ముందు త‌న‌ను స‌ర్ అని ప్రేమ పూర్వ‌కంగా పిలిచాడు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోవ‌డం విజ‌య్ సేతుప‌తికి ప్ల‌స్ పాయింట్ గా మారింది. తాజాగా ఉరుగుధ‌మ్ ఉరుగుధమ్ పేరుతో ఏస్ మూవీకి సంబంధించి సాంగ్ విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. ఈ మ‌ధ్య కాలంలో ఇంత అద్భుతంగా పిక్చ‌రైజేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఫేస్ లో భావాల‌ను ప‌లికించ గ‌ల‌గ‌డం మామూలు విష‌యం కాదు.

త‌న‌తో జ‌త క‌ట్టింది అందాల ముద్దుగుమ్మ రుక్మిణి. ఇద్ద‌రూ అద్భుతంగా ఒదిగి పోయారు ఈ సాంగ్ లో. ఈ చిత్రాన్ని ఆరుముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతం అందించ‌గా శ్రేయా ఘోష‌ల్, క‌పిల్ క‌పిల‌న్ పాడారు హృద‌యానికి హ‌త్తుకునేలా.

Also Read : Hero Priyadarshi Movie : ఏప్రిల్ 18న సారంగపాణి జాత‌కం

CinemaRukmini VasanthTrendingUpdatesVijay Sethupathi
Comments (0)
Add Comment