Shah Rukh Khan : యానిమ‌ల్ మూవీపై ఖాన్ కామెంట్

అద్భుతంగా ఉందంటూ కితాబు

Shah Rukh Khan: ర‌ణ‌బీర్ క‌పూర్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టిస్తున్న చిత్రం యానిమ‌ల్. దీనికి టాలీవుడ్ కు చెందిన వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే మూవీకి సంబంధించిన పోస్ట‌ర్స్, స్టిల్స్ , సాంగ్స్ జ‌నాద‌ర‌ణ పొందాయి. రిలీజ్ కాకుండానే సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. భారీ మార్కెట్ ను సాధించింది.

Shah Rukh Khan Comment Viral

భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన యాన‌మిల్ మూవీపై మూవీ మేక‌ర్స్ న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నారు. దీంతో నిర్మాత‌ల్లో ఒక‌రైన భూష‌ణ్ కుమార్ ఏకంగా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డికి అత్యంత ఖ‌రీదైన రూ. 5 కోట్ల కారును గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది ప‌క్క‌న పెడితే సినిమా డిసెంబ‌ర్ 1న చిత్రం విడుద‌ల కానుంది. మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు పంచుకున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్(Shah Rukh Khan ) . ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి తీసిన తీరు అద్భుతంగా ఉంద‌న్నాడు. యానిమ‌ల్ మూవీలో న‌టీన‌టులు అద్భుతంగా న‌టించార‌ని కొనియాడారు.

ద‌ర్శ‌కుడికి మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌ని పేర్కొన్నారు బాద్ షా. రికార్డులను క్రియేట్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Also Read : Papa Meri Jaan : పాపా మేరీ జాన్ సెన్సేష‌న్

Comments (0)
Add Comment