Shah Rukh Khan Security : బాద్ షాకు వై ప్ల‌స్ సెక్యూరిటీ

బెదిరింపు నేప‌థ్యంలో ఏర్పాటు

ముంబై – ప్ర‌ముఖ బాలీవుడ్ అగ్ర న‌టుడు షారుక్ ఖాన్ కు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. ఈ మేర‌కు బాద్ షాకు వై ప్ల‌స్ సెక్యూరిటీని క‌ల్పిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

వై ప్ల‌స్ కేట‌గిరీ కింద షారుక్ ఖాన్ కు ఆరుగురు క‌మాండ్ ల‌తో పాటు 11 మంది భ‌ద్ర‌తా సిబ్బంది, ఒక పోలీస్ ఎస్కార్ట్ వాహ‌నం ఉంటుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం బాద్ షా వ‌య‌సు 57 ఏళ్లు. ఆయ‌న‌కు ఈ ఏడాది భారీగా క‌లిసి వ‌చ్చింది. షారుక్ ఖాన్ దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ రూ. 1,000 కోట్లు సాధించింది. ఇది ఓ రికార్డ్.

ఇదే స‌మ‌యంలో త‌మిళ సినీ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో షారుక్ ఖాన్ , న‌య‌న తార‌, దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపింది. భారీ ఎత్తున వ‌సూళ్లు సాధించింది.

దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్న షారుక్ ఖాన్ కు ఉన్న‌ట్టుండి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. త‌న‌ను చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది మ‌రాఠా స‌ర్కార్.

Comments (0)
Add Comment